News
News
X

తెలుగులో హీరోలు లేరా? మలయాళం నుంచి రావాలా? - దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్

తెలుగులో సినిమాలు చేయడానికి తెలుగు హీరోలు లేరా? ఎక్కడో మలయాళం నుంచి నటులు రావాలా? అంటూ నటుడు సంతోష్ శోభన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

FOLLOW US: 

‘‘తెలుగు సినిమాలు చెయ్యడానికి తెలుగు హీరోలు లేరా? ఎక్కడో మలయాళం నుంచి మమ్ముట్టి గారి కొడుకు రావాలా?’’ అని నటుడు సంతోష్ శోభన్ అసహనం వ్యక్తం చేశారు. ‘సీతారామం’ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే, సంతోష్ ఈ వ్యాఖ్యలను సరదాగా చేసినా.. మనసులో మాటను బయటకు చెప్పేశాడా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. 

‘సీతారామం స్వరాలు’ పేరుతో చిత్ర బృందం ఓ మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సామాజిక మధ్యమాల్లో విడుదల చేసింది. ఈ వేడుకకు రౌడీ బాయ్ విజయ్  దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటుడు సంతోష్, హీరోయిన్ మాళవిక కూడా వచ్చారు. వాళ్ళని యాంకర్ సుమ వేదిక మీదకి రమ్మని పిలిచింది. అప్పుడు సంతోష్ మాట్లాడుతూ.. ‘‘మనలో మన మాట తెలుగు సినిమాలు చెయ్యడానికి తెలుగు హీరోలు లేరా? ఎక్కడో మలయాళం నుంచి మమ్ముట్టి గారి కొడుకును తీసుకురావాలా? అని అన్నారు. దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు ఇప్పుడు’’ అని సంతోష్ అన్నాడు. ‘‘తెలుగులో కొన్ని ప్రశ్నలు వేస్తాను. అందుకు దుల్కర్ సరైన సమాధానాలు చెప్తే తెలుగు హీరో అని ఒప్పుకుంటా’’ చెప్పారు. అయితే, దుల్కర్.. శోభన్ అడిగిన అన్ని ప్రశ్నలకు తెలుగులో సమాధానం చెప్పేసి ఆశ్చర్యపరిచాడు.

ఈ వేడుకకి సంతోష్, మాళవిక రావడానికి మరో కారణం కూడా ఉంది. వైజయంతీ మూవీస్ నెట్ వర్క్ స్వప్న సినిమాస్ మీద సంతోష్ హీరోగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం తెరకెక్కుతోంది. అందుకే ఈ కార్యక్రమానికి ఆ సినిమాలో నటిస్తోన్న సంతోష్, మాళవిక కూడా వచ్చారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వస్తోన్న సినిమా ‘సీతారామం’. ఇందులో దుల్కర్ కి జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు మృణాల్ పరిచయమవుతోంది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ యుద్ధం రాసిన ప్రేమ కథ అంటూ 20 ఏళ్ల క్రితం ఓ సైనికుడికి.. అమ్మాయికి మధ్య సాగిన ప్రేమను ఇందులో చూపించబోతున్నారు. ఆగస్టు 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.

Also Read: సెక్యూరిటీ పెంచిన సల్మాన్ ఖాన్ - సేఫ్టీకిగన్ లైసెన్స్, ఇప్పుడు కారుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్

Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?

Published at : 03 Aug 2022 12:55 PM (IST) Tags: Sita Ramam movie Sitaramam Movie Promotions Dulkar Salman Actor Santosh Shobhan Vyjayanthi Movies

సంబంధిత కథనాలు

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేదింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేదింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?

Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి

Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి

టాప్ స్టోరీస్

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్

Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది:  ఏపీ సీఎం జగన్