Salman Khan: సల్మాన్ ఖాన్‌కు ప్రాణభయం, కోట్లు వెచ్చించి తన కారును ఇలా మార్చేశాడు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సేఫ్టీ విషయంలో మరో అడుగు వేశారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతో ఆయన కారును అప్ గ్రేడ్ చేశారు.
సెక్యూరిటీ విషయంలో హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంబై పోలీసులు సైతం ఆయన సెక్యూరిటీ పెంచారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉండటంతో ఇటీవల గన్ లైసెన్స్ కోసం సల్మాన్ ఖాన్ అప్లికేషన్ పెట్టుకోగా... ముంబై పోలీసులు మంజూరు చేశారు. లేటెస్టుగా తాను ప్రయాణించే కారును బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు అప్ గ్రేడ్ చేశారు సల్మాన్.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దుబాయ్‌లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత విదేశాలకు వెళ్లారు. జర్నీకి ముందు ముంబై ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న వీడియో గమనిస్తే... టయోటా లాండ్ క్రూయిజర్‌లో సల్మాన్ వచ్చారు. ఆయనతో పాటు పర్సనల్ సెక్యూరిటీ బాడీగార్డ్ షేర్షా, మరికొంత సెక్యూరిటీ ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతో ఉన్న ఆ కారు ఖరీదు సుమారు కోటిన్నర ఉంటుందని సమాచారం.
View this post on Instagram
పంజాబీ గాయకుడి హత్య తర్వాత...
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలా హత్య తర్వాత సల్మాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామని కొంత మంది ఆగంతుకులు ఫోనులు చేసి బెదిరించారు. ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో జూన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉండటంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను పోలీసులు విచారించారు.
Also Read : నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
ఇటీవల ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సల్కర్, ముంబై లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ విశ్వాస్ నంగ్రే పాటిల్‌ను సల్మాన్ ఖాన్ కలిశారు. గన్ లైసెన్స్ కోసం అప్లై చేశారు. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని 2018లోనూ లారెన్స్ బిష్ణోయ్ ఒకసారి బెదిరించినట్టు సమాచారం.
Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్