Ahimsa Trailer: ‘అహింస’ ట్రైలర్ - గాంధీ కాదు కృష్ణుడే కరెక్ట్ అంటున్న దగ్గుబాటి అభిరామ్
తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ నటించిన ‘అహింస’ ట్రైలర్ వచ్చేసింది. తేజా మార్క్ మూవీస్‌ను ఇష్టపడేవారికి ఈ ట్రైలర్ నచ్చేస్తుంది.
నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా నిర్మిస్తు్న్న మూవీ ‘అహింసా’. తేజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. దగ్గుబాటి వంశం నుంచి వచ్చిన వెంకటేష్, రానా ఇప్పటికే తమ టాలెంట్‌ను చూపించి సినిమా రంగంలోకి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీతో ఉన్నారు. పైగా తేజా దర్శకత్వంలో రూపొందిస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Director @Tejagaru Garu always comes up with something sensational!
— Ram Charan (@AlwaysRamCharan) January 12, 2023
My best wishes to dear #Abhiram for his debut and to the entire team🤗
Here’s #Ahimsa Trailer
- https://t.co/bGRqxgBqfF
Looking forward to the release👍🏻@rppatnaik #Geethika #Sadaa @AnandiArtsOffl
ఇక ట్రైలర్‌ను బట్టి చూస్తే.. వ్యవసాయం చేసుకుని జీవించే ఓ రైతు బిడ్డ, ఓ భూస్వామి మధ్య జరిగే పోరాటంలా కనిపిస్తోంది. మరోవైపు అక్రమ కేసులు, జడ్జిల బ్రోకర్ అండతో ప్రతినాయుకుడు హీరోను ఎలా ఇబ్బంది పెట్టాడనేది ట్రైలర్‌లో చూపించాడు. ఇందులో సదా లాయర్ పాత్రలో కనిపించింది. హీరోకు అండగా నిలిచే పాత్రగా చూపించారు. అమాకుడైన హీరో ప్రతినాయుకులపై తిరగడతాడు. చివరికి హింసా మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ సందర్భంగా వచ్చే ఒక డైలాగ్ బాగుంది. ‘‘గాంధీ, బుద్ధుడు కాదు. కృష్ణుడే కరెక్ట్, ధర్మపోరాటం చేస్తా’’ అని అభిరామ్ చెప్పే డైలాగ్‌తో సినిమా కథ అర్థమైపోతుంది. మొత్తంగా చూస్తే.. మీకు తప్పకుండా తేజా మార్క్ మాత్రమే కాదు, తేజా గతంలో తీసిన సినిమాలన్నీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. అలాగే అభిరామ్‌లో అభినయం కూడా అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలిసిపోతుంది. అమాయకపు హీరో, బలమైన విలన్.. ఇదే కాన్సెప్ట్‌తో తేజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి, ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలరో చూడాలి. ఈ మూవీలో హీరోయిన్ గీతక.. అభిరామ్‌కు మరదలిగా నటిస్తోంది.
‘అహింస’ ట్రైలర్:
‘అహింసా’ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పి కిరణ్ ('జెమిని' కిరణ్) నిర్మాత. ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆర్పీ పట్నాయక్ మళ్లీ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో తేజా దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు ఆర్పీ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో పాటలు అన్నీ చంద్రబోస్ రాశారు. మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమెరా: సమీర్ రెడ్డి, ఫైట్స్: రియల్ సతీష్.
Read Also: ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం, ‘RRR’ టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు