అన్వేషించండి

Vaazhai OTT: ఓటీటీలోకి వచ్చేసిన సెల్వరాజ్ తమిళ బ్లాక్ బస్టర్... ఎక్కడ చూడాలంటే?

తమిళ బ్లాక్‌ బస్టర్ మూవీ ‘వారై’ ఓటీటీలోకి వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Vaazhai OTT Streaming: రీసెంట్‌గా తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘వాళై’. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఈ సినిమా కథ డబ్బులు తీసుకుని అరటి గెలలు కోయడానికి వెళ్లే పిల్లాడి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. మూవీలోని డ్రామా, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. పల్లెటూరు వాతావరణాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. చిన్న పిల్లల నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని క్లైమాక్స్ వారెవ్వా అనిపించింది. తక్కువ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 40 కోట్లు వసూళు చేసింది. ఈ సినిమా విడుదలైన వారం రోజులకే దళపతి విజయ్ నటించిన ‘ది గోట్‘ సినిమా థియేటర్లలోకి రావడంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది.

ఓటీటీలోకి వచ్చేసిన ‘వాళై‘

మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ‘వాళై‘ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం జరిగినా... చివరకు థియేటర్లలోనే విడుదల అయ్యింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్, నవ్వి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అందుకే, ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌ గా ఓటీటీలోనే వస్తుందనే టాక్ నడిచింది. కానీ, మేకర్స్ చివరకు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. సెల్వరాజ్ కెరీర్ లో నాలుగో చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. వసూళ్ల విషయంలోనూ సత్తా చాటింది. ప్రేక్షకులకు ఫీల్ గుడ్ ఫీలింగ్ కలిగించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీలో అందుబాటులో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ వేదికగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు.

వరుసగా నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్

తమిళ సినిమా పరిశ్రమలో దర్శకుడు మారి సెల్వరాజ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల మనసుకు తాకే సినిమాలను తెరకెక్కించడంలో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. రైటర్ గా సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆయన, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. 2018లో ఆయన తెరకెక్కించిన ‘పరియేరుమ్ పెరుమాళ్‘ అనే సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన రూపొందించిన ‘కర్ణన్‘ మూవీ సైతం మంచి సక్సెస్ అందుకుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘మామన్నన్‘ సైతం మంచి విజయాన్ని అందుకుంది. వరుస హ్యాట్రిక్ హిట్స్ ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో వచ్చిన  ‘వాళై‘ సైతం ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.   

Read Also: ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్... చోటా సినిమాకు రానా దగ్గుబాటి సపోర్ట్!

టాప్ హెడ్ లైన్స్

Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Rithu Chowdary: తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
తనూజ వెబ్ సిరీస్‌పై రీతూ చౌదరి కామెంట్స్... కళ్యాణ్ పాటపై ఏమన్నారంటే?
Godavari Serial Today September 12th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కూతురితో డేటింగ్ చేస్తానన్న సంజు! దిమ్మతిరిగే షాక్!
'గోదావరి' సీరియల్: పెళ్లి కూతురితో డేటింగ్ చేస్తానన్న సంజు! దిమ్మతిరిగే షాక్!
Ganesh Chaturthi 2026 Songs : బొజ్జ గణపయ్యకు ఈ పాటలతో గ్రాండ్ వెల్కమ్ - గణేష్ చతుర్థి టాలీవుడ్ టాప్ 5 సాంగ్స్
బొజ్జ గణపయ్యకు ఈ పాటలతో గ్రాండ్ వెల్కమ్ - గణేష్ చతుర్థి టాలీవుడ్ టాప్ 5 సాంగ్స్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gannavaram MLA Yarlagadda: డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
డబ్బులిస్తేనే పోలీసులు పనిచేస్తారా?.. కేసరపల్లి ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్
BRICS Summit 2026: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
బ్రిక్స్ సమ్మిట్ 2026.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
Andhra Pradesh Rains Alert: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈ జిల్లాల్లో 2 రోజులపాటు భారీ వర్షాలు
Bolarum Arms Theft: రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లోనే ఆయుధాలు - పక్కాగా చోరీ - సంచలన వివరాలు వెల్లడించిన డీజీపీ
TS Govt Free Insurance Scheme: ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఉద్యోగులకు ఉచితంగా కోటి రూపాయల ప్రమాద బీమా - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Election Commission SIR notices: హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
హైదరాబాద్ వీఐపీలకు ఓట్ల గండం - మహేష్ బాబు, రాజమౌళి, సైనా నెహ్వాల్‌లకు SIR నోటీసులు - వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే
Prabhas : ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
22A Lands Issue: కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కొండల్, తొండల్, అనకొండల్ దందా -22A భూబాధితుల భేటీలో సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Embed widget