The Legend Telugu Trailer: ‘ది లెజెండ్’ తెలుగు ట్రైలర్: ఈ సైంటిస్ట్ మరణాన్ని పరిచయం చేస్తాడు, అదరగొట్టేసిన శరవణన్!
ఇది బాలయ్య ‘లెజెండ్’ కాదు.. శరవణన్ నటించిన ‘ది లెజెండ్’. జులై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రముఖ వాణిజ్యవేత్త, శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది లెంజెడ్’. ఈ సినిమా తమిళ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. మిలియన్ల మంది ఈ ట్రైలర్‌ను వీక్షించారు. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఆయన ఎంత ఘనంగా నిర్వహించారో తెలిసిందే. పూజా హెగ్డే, తమన్నా, హన్సిక, లక్ష్మీ రాయ్, డింపుల్ హయతి, శ్రద్ధా శ్రీనాథ్, యాషికా ఆనంద్.. ఇలా 10 మంది హీరోయిన్లతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు శరవణన్.
‘ది లెజెండ్’కు వచ్చిన రెస్పాన్స్ చూసి తెలుగు ప్రేక్షకులకు సైతం ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా శరవణన్ ఆత్మవిశ్వాసానికి అంతా ఫిదా అవుతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా జులై 28న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హీరోయిన్ తమన్నా చేతుల మీదుగా ‘ది లెజెండ్’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ది లెజెండ్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన హీరో శరవణన్‌తో కలిసి తెలుగు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి జెడి - జెర్రీ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శరవణన్ మైక్రో బయాలజీ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఇందులోని ప్రతి సీన్‌లోనూ భారీతనం ఉట్టిపడుతోంది. పాటలు నుంచి పోరాట సన్నివేశాలు.. అదిరిపోయే డైలాగులతో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సైంటిస్ట్ సామాన్యుడు కాదని, మరణాన్ని పరిచయం చేస్తాడంటూ హీరో శరవణన్ పాత్రను ఇచ్చిన హైప్ మామూలుగా లేదు. ఇంకెందుకు ఆలస్యం ‘ది లెజెండ్’ తెలుగు ట్రైలర్ చూసేయండి మరి.
Also Read: రవితేజ ఆన్ డ్యూటీ - మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ట్రైలర్ వచ్చేసిందిగా
Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

