Tamannaah Marriage : త్వరలో వ్యాపారవేత్తతో పెళ్లి - తమన్నా రియాక్షన్ ఏంటంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? ముంబైకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే ముంబై మీడియా అవునని అంటోంది. మరి, తమన్నా ఏమన్నారో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారా? అంటే... 'అవును' అని ముంబై మీడియా అంటోంది. ముంబైకు చెందిన ఓ యువ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. హన్సిక తరహాలో తమన్నా కూడా వ్యాపారవేత్తతో పెళ్లికి అంగీకరించడం విశేషం అని వార్తలు రాసుకొచ్చారు. అవి తమన్నా వరకు వెళ్లాయి. దాంతో ఆవిడ స్పందించారు.
నా భర్తను చూడండి!
Tamannaah On Her Marriage : ''ఏంటి? నేను పెళ్లి చేసుకోబోతున్నానా? సీరియస్‌లీ??'' అని తమన్నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తొలుత తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరో స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ''నాకు కాబోయే భర్త, వ్యాపారవేత్తను పరిచయం చేస్తున్నాను. చూడండి'' అని వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎవరు ఉన్నారో తెలుసా? 'ఎఫ్ 3'లో కొంత సేపు ఆమె మగరాయుడి వేషం వేశారు కదా! ఆ గెటప్ అది! దాంతో తమన్నా పెళ్లి అంటూ వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు మాత్రమేనని ఆవిడ స్పష్టం చేసినట్టు అయ్యింది.
View this post on Instagram
పెళ్లి కోసమే కొత్త సినిమాలు సంతకం చేయడం లేదట!
ముంబై వ్యాపారవేత్త కొన్ని రోజుల నుంచి తమన్నా ముందుకు పెళ్లి ప్రతిపాదన తీసుకు వస్తున్నారని, ఎట్టకేలకు ఆమె అంగీకరించారనేది ముంబై రూమర్స్ సారాంశం. అంతే కాదు... పెళ్లి కోసమే తమన్నా కొత్త సినిమాలు అంగీకరించడం లేదని రాసుకొచ్చారు. అదీ సంగతి!
Also Read : ట్విట్టర్‌లో రష్మిక ఫ్యాన్స్ వింత కోరిక - తెరపైకి కొత్త డిమాండ్
ఇప్పుడు తమన్నా వయసు 32 ఏళ్ళు. హీరోయిన్లకు వస్తే ఇదేమీ పెళ్లి వయసు కాదు. తమన్నా కంటే ఎక్కువ వయసున్న, పెళ్లి చేసుకొని కథానాయికలు కొందరు ఉన్నారు మరి!
తెలుగులో రెండు సినిమాలు!
ప్రస్తుతం తమన్నా చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి... మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'. చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా తమన్నా నటిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. సత్యదేవ్ జోడీగా తమన్నా నటించిన 'గుర్తుందా శీతాకాలం' చిత్రీకరణ పూర్తి అయింది. విడుదలకు రెడీగా ఉంది. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు. వీటి కంటే ముందు మధుర్ భండార్కర్ దర్శకత్వంలో నటించిన 'బబ్లీ బౌన్సర్' ఓటీటీలో విడుదలైంది.