Rashmika Fans Demands : ట్విట్టర్‌లో రష్మిక ఫ్యాన్స్ వింత కోరిక - తెరపైకి కొత్త డిమాండ్
రష్మిక అభిమానులు ట్విట్టర్‌లో వింత కోరిక కోరుతున్నారు. నేషనల్ క్రష్ ముందు కొత్త డిమాండ్ ఉంచారు. దీనిపై ఆవిడ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మీరు ఈ రోజు ట్విట్టర్ ఓపెన్ చేశారా? #WeWantRashmikasTime హ్యాష్ ట్యాగ్ ఒకటి ట్రెండ్ అవుతుంది చూశారా? దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసా? నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అభిమానులే. ఆమె ముందు కొత్త డిమాండ్ ఉంచారు. వింత కోరికను కోరుతున్నారు. ఆ కోరిక తీర్చడం రష్మికకు పెద్ద కష్టం ఏమీ కాదనుకోండి. మరి, ఆవిడ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అసలు ఫ్యాన్స్ డిమాండ్ ఏంటి? అనే విషయంలోకి వెళితే...
మాకు రష్మిక టైమ్ కావాలి!
We Want Rashmikas Time (మాకు రష్మిక టైమ్ కావాలి) - ఇదీ అభిమానులు చేస్తున్న డిమాండ్. సోషల్ మీడియాలో రష్మిక యాక్టివ్‌గా ఉంటారు. తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ పోస్టులు చేస్తూ ఉంటారు. ట్విట్టర్ విషయానికి వస్తే ఇన్‌స్టాలో ఉన్నంత యాక్టివ్‌గా లేరు. అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే లేరని, ట్విట్టర్‌లో కూడా ఉన్నారని, వాళ్ళ కోసం ఆవిడ కొంత టైమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : త్రివిక్రమ్ గారూ - రోజా మనసులో మాట విన్నారా?
''మాకు తెలుసు... మీరు బిజీగా ఉన్నారని! కానీ, కనీసం వారానికి ఒకసారి అయినా సరే మా కోసం ట్విట్టర్ ఓపెన్ చేయండి'' - ఇదీ ఓ నెటిజన్ ట్వీట్.
We know you are Busy ☺️☺️
— Rashmika Cult (@RashmikaCult) November 16, 2022
But still we want your time atleast once in a week🧎🧎🤗.@iamRashmika#RashmikaMandanna#WeWantRashmikasTime pic.twitter.com/nDODjPENOm
''మేము ఏదీ ఎక్కువ అడగటం లేదు. మీ టైమ్‌లో కొంత కావాలంతే! మా విజ్ఞప్తిని పరిశీలిస్తారని ఆశిస్తున్నాం'' - మరో నెటిజన్ ట్వీట్.
#WeWantRashmikasTime
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) November 15, 2022
We know you are busy @iamRashmika 😊❤️
We are not asking much
We just want a little time of yours 😊
I hope you consider our Request#RashmikaMandanna pic.twitter.com/Cntec30mAN
'ట్విట్టర్‌లోకి లాగిన్ అవ్వండి. మీకు అభిమానుల ప్రేమను చూస్తారు' - ఇది మరొక ట్వీట్.
#WeWantRashmikasTime
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) November 15, 2022
Please login to twitter @iamRashmika ❤️😊
You will see only love from your fans#RashmikaMandanna pic.twitter.com/kOzAIysuvk
మెజారిటీ ట్వీట్స్ ఫ్యాన్స్ నుంచి, ఫ్యాన్ పేజీల నుంచి వస్తున్నాయి.
#WeWantRashmikasTime
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) November 16, 2022
I think 1st time we are asking something for us @iamRashmika ❤️😊
And that's too is not so big.
A little time of our #nationalcrush
Please mark your attendance on twitter and give reply to some of your fans.❤️😊#RashmikaMandanna pic.twitter.com/Rbg7EG1019
రష్మిక మందన్నా (Rashmika Mandanna) హుషారైన అమ్మాయి. ఎప్పుడూ ఆమె ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంటుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ... ఆమె కూడా మనిషే కదా! ట్రోల్స్ తనను ఏ విధంగా బాధిస్తున్నాయి? అనే విషయాన్ని ఈ మధ్య వెల్లడించారు. రష్మిక ఫిట్‌నెస్ విషయంలో కూడా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంటారు. లేటెస్టుగా ఆవిడ వర్కవుట్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు.
మెజారిటీ విషయాలకు ఎక్స్‌ర్‌సైజ్ చేయడమే అత్యుత్తమ ఔషధం (మంచి మందు) అని రష్మిక పేర్కొన్నారు. ''బాధలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు... సంతోషంలోనూ, దుఃఖంలోనూ... ప్రశాంతతలోనూ, ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు... ఎలా ఉన్నా వర్కవుట్ చేయండి. వర్కవుట్ చేసిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో కదా! ఒకవేళ ఎవరైనా వర్కవుట్ చేయకపోతే ట్రై చేయండి'' అని రష్మిక పేర్కొన్నారు.
వదిలేస్తే వరస్ట్‌గా చేస్తున్నారేంటి?
తన తప్పు ఏమీ లేనప్పటికీ... తనను టార్గెట్ చేస్తూ వస్తున్న ట్రోల్స్, మీమ్స్‌పై ఇటీవల రష్మిక (Rashmika Mandanna) ఘాటుగా స్పందించారు. ఆ ట్రోల్స్ వగైరా వగైరా నిరుత్సాహ పరిచే విధంగా ఉన్నాయని, గుండె బద్దలు అయ్యేలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తనపై కొందరు విషం చిమ్ముతున్నారని, తనను ద్వేషిస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోల్స్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకు తానొక పంచింగ్ బ్యాగ్ కింద మారినట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. చాలా రోజులుగా తాను విమర్శలను విస్మరిస్తూ వస్తున్నానని... అయితే రోజు రోజుకూ వాళ్ళ ప్రవర్తన వరస్ట్ అవుతోందని రష్మిక వివరించారు.
సినిమాలకు వస్తే... విజయ్ జోడీగా ఆవిడ నటించిన 'వారసుడు' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అందులో 'రంజిదమే' సాంగ్ విడుదల అయ్యింది. తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2', హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే 'యానిమల్'లో కూడా ఆవిడ నటించనున్నారు. ఈ ఏడాది 'గుడ్ బై'తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక... సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా 'మిషన్ మజ్ను'లో కనిపించనున్నారు.