Trivikram - Roja : త్రివిక్రమ్ గారూ - రోజా మనసులో మాట విన్నారా?
కథానాయికగా, ఆ తర్వాత నటిగా, కొన్నాళ్ళు 'జబర్దస్త్' జడ్జ్‌గా తెలుగు ప్రజలను అలరించిన రోజా... తన రీ ఎంట్రీ గురించి మాట్లాడారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గంలో రోజా (Actress Roja) కు చోటు కల్పించిన తర్వాత ఆవిడ నటనకు దూరం అయ్యారు. అప్పటి వరకు ఆమె 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' (Extra Jabardasth) షోస్‌కు జడ్జ్‌గా చేశారు. జబర్దస్త్ జడ్జ్ కంటే ముందు రోజా హీరోయిన్. తెలుగులో కృష్ణ వంటి స్టార్స్‌తో, ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించారు. హీరోయిన్ నుంచి అమ్మ, అత్త పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. మంత్రి అయిన తర్వాత నటనకు పూర్తిగా దూరం అయ్యారు. ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నారు.
మహేష్‌కు అత్తగా నటించాలని...
కృష్ణకు జంటగా రోజా కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు కృష్ణ కుమారుడు మహేష్ బాబుతో నటించాలని ఆమె ఆశ పడుతున్నారు. సూపర్ స్టార్ మరణించిన (Krishna Death) సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి వెళ్లిన రోజా... తన మనసులో కోరికను బయట పెట్టారు. మరోసారి కెమెరా ముందుకు వస్తే మహేష్ అత్తగా రావాలని ఉందని, మహేష్‌తో నటించాలని ఉందని ఆవిడ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు త్రివిక్రమ్ మాత్రమే రోజాకు ఛాన్స్ ఇవ్వగలరు!
రోజా మనసులో ఉన్నది నిజం కావాలంటే... ఇప్పటికి ఇప్పుడు త్వరగా ఆమె కెమెరా ముందుకు రావాలంటే... ఒక్క త్రివిక్రమ్ వల్లే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఆయన ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలకు తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ హీరోయిన్లను సెలెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మహేష్ తాజా సినిమా కోసం ఎవరినీ తీసుకోలేదు. ఆ అవకాశం రోజాకు దక్కుతుందో? లేదో? చూడాలి.
కృష్ణ మరణంతో SSMB 28కి బ్రేక్!
SSMB 28 Update : ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా హీరోగా ఆయనకు 28వ సినిమా (SSMB 28). ఆల్రెడీ ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు. మొన్న ఫ్యామిలీతో కలిసి మహేష్ లండన్ వెళ్లి వచ్చిన తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. నవంబర్ నెలాఖరున లేదంటే డిసెంబర్ తొలి వారంలో షూటింగ్ పునః ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు కృష్ణ మరణంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటు త్రివిక్రమ్, అటు మహేష్ బాబుతో ఆయనది మ్యూజికల్ హిట్ కాంబినేషన్. ఈ సినిమాకి కూడా సూపర్ డూపర్ ట్యూన్స్ ఇస్తున్నారట.
Also Read : కృష్ణకు కడసారి వీడ్కోలు - తీవ్ర భావోద్వేగానికి గురైన మహేష్ బాబు, అభిమానులు కన్నీళ్లు
వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే... వేసవికి సినిమా రావడం కష్టమే అనిపిస్తోంది. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.