అన్వేషించండి

Kanguva : AI సాయంతో సూర్యకు డబ్బింగ్, ‘కంగువ’ మేకర్స్ ఫ్లాన్ వర్కౌట్ అయ్యేనా?

Suriyas Kanguva : సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువ’ మూవీపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

Kanguva Movie Dubbing : తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సిరుత్తై శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఎక్స్ స్పేస్ సెషన్ నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘కంగువ’ తమిళ వెర్షన్ మినహా, మిగతా అన్ని భాషల్లో AI సాయంతో డబ్బింగ్ చెప్పించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగింది.

తమిళ వెర్షన్ కు సూర్య డబ్బింగ్

‘కంగువ’ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ‘కంగువ’ సినిమాకు సంబంధించి, తమిళ వెర్షన్ కు హీరో సూర్య డబ్బింగ్ చెప్పనున్నారు. ఇతర భాషల్లో ఆయన క్యారెక్టర్ కు ఏఐ సాయంతో డబ్బింగ్ చెప్పించనున్నట్లు మేకర్స్ తెలిపారు. వాస్తవానికి గత కొంతకాలంగా సినిమాల్లో AIని విస్తృతంగా వినియోగిస్తున్నారు. రీసెంట్ గా ‘వేట్టయాన్’ సినిమాలోనూ AI సాయం తీసుకున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ వాయిస్ అనుకున్నట్లుగా రాకపోవడంతో, AI సాయంతో మరిన్ని మెరుగులు అద్దారు. ఆ తర్వాత బిగ్ బీ వాయిస్  మెరుగయ్యింది. ఇప్పుడు, సూర్యకు తమిళ వెర్షన్ తప్ప, మిగతా అన్ని భాషల్లో AI సాయంతోనే డబ్బింగ్ చెప్పించాలని భావించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ విధానం ఏ మేరకు వర్కౌట్ అవుతుందోనని సినీ టెక్నీషియన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విదేశీ భాషల్లోనూ ‘కంగువ’ విడుదల

ప్రతిష్టాత్మక ‘కంగువ’ సినిమాను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ సహా దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. అటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. అయితే, ఈ సినిమాను 3D వెర్షన్ లో విడుదల చేయాలా? వద్దా? అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని చెప్పారు.  

నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ‘కంగువ’ విడుదల

‘కంగువ’ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్లకు ప్రేక్షకులకు మంచి ఆదరణ లభించింది. వాస్తవానికి ఈ సినిమాను దసరా కానుకగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. రజనీకాంత్ ‘వేట్టయాన్’ అదే సమయంలో విడుదల కావడంతో మేకర్స్ తమ సినిమాను విడుదలను వాయిదా వేశారు. సూర్య కెరీర్ లో 42వ ప్రాజెక్ట్ తెరకెక్కిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14, 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read Also: ఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Liquor Shops : ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ- లాటరీ ద్వారా ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ- లాటరీ ద్వారా ఖరారు  
Weather Today: ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
US Elections 2024: ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు 
ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు 
Cardio vs Weights : జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే
జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

80 వేల ఏళ్లకి ఒకసారి కనిపించే తోకచుక్క, తిరుపతిలో అద్భుత దృశ్యంBaba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samson

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Liquor Shops : ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ- లాటరీ ద్వారా ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ- లాటరీ ద్వారా ఖరారు  
Weather Today: ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత
US Elections 2024: ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు 
ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు 
Cardio vs Weights : జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే
జిమ్​లో కార్డియో చేస్తే మంచిదా? వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే
OTT Psychological Thriller: ఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
ఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
Chittoor News: తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో జోరు వానలు- నీరు ఒడిసి పట్టే చర్యలే శూన్యం
తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో జోరు వానలు- నీరు ఒడిసి పట్టే చర్యలే శూన్యం
Viral News: జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసులో దసరా దావత్ - ప్రభుత్వాఫీస్‌ను బార్‌లో మార్చేసిన అటవీశాఖాధికారులు
జగిత్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసులో దసరా దావత్ - ప్రభుత్వాఫీస్‌ను బార్‌లో మార్చేసిన అటవీశాఖాధికారులు
OTT Family Drama: రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెజీనా సినిమా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెజీనా సినిమా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Embed widget