OTT Psychological Thriller: ఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
Level Cross OTT Streaming: తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథానాయిక అమలా పాల్ నటించిన మలయాళ సైకాలజికల్ థ్రిల్లర్ 'లెవల్ క్రాస్'. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Level Cross OTT Streaming Platform: అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగచైతన్య 'బెజవాడ', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమాల్లో నటించింది. ప్రజెంట్ మలయాళ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఆవిడ నటించిన రీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలోకి వచ్చింది.
ప్రైమ్ వీడియోలో లెవెల్ క్రాస్...
తెలుగులోనూ స్ట్రీమింగ్ షురూ!
అమలా పాల్ (Amala Paul) ప్రధాన పాత్రలో నటించిన తాజా మలయాళ సినిమా 'లెవెల్ క్రాస్' (Level Cross Movie). ఇందులో ఆసిఫ్ అలీ హీరో. షరాఫ్ యు దిన్ మరో ప్రధాన పాత్ర పోషించారు. అర్ఫాజ్ ఆయూబ్ దర్శకత్వంలో రమేష్ పి పెళ్లై ప్రొడ్యూస్ చేశారు. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా మలయాళ వెర్షన్ విడుదల అయింది. కేరళలో ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేశారు.
థియేటర్లలో విడుదలైన రెండున్నర నెలల తర్వాత 'లెవెల్ క్రాస్' ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 13వ తేదీ నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో తీసి, మలయాళంలో విడుదల చేసిన ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలలో అనువదించి ఓటీటీ ఆడియన్స్ కోసం తీసుకొచ్చారు.
Also Read: రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెజీనా సినిమా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
View this post on Instagram
'లెవెల్ క్రాస్' కథ ఏమిటి?
అమలా పాల్ క్యారెక్టర్ ఏమిటి?
ఓ లెవెల్ క్రాస్ దగ్గర రఘు గేట్ కీపర్. అతను చాలా రోజులుగా ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఒక రోజు రైల్వే ట్రాక్ దగ్గర అతనికి ఓ అమ్మాయి కనిపిస్తుంది. ట్రైన్ నుంచి ఆమె కిందకి దూకుతుంది. ప్రాణాలతో ఉన్న ఆమెను రఘు కాపాడుతాడు. రికవరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు? ట్రైన్ నుంచి ఎందుకు దూకేసింది? ఆమె గతం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
సైకలాజికల్ థ్రిల్లర్... 'దృశ్యం' కనెక్షన్!
'లెవెల్ క్రాస్' సినిమా ఓ సైకలాజికల్ థ్రిల్లర్. మలయాళంలో ఇటీవల కాలంలో వచ్చిన మంచి థ్రిల్లర్ మూవీస్ అంటే మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'దృశ్యం' తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఆ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ఆర్ఫాజ్ ఆయుబ్ ఈ 'లెవెల్ క్రాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ', 'సీతా రామం' వంటి చిత్రాలకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇందులో అమలా పాల్ చేత ఒక పాట కూడా పాడించారు.