అన్వేషించండి

Mahesh Babu: కృష్ణుడిగా సూపర్ స్టార్ - SSMB29కి ముందు స్వీట్ సర్‌ప్రైజ్!

Devaki Nandana Vasudeva: అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న ‘దేవకి నందన వసుదేవ’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu As Lord Sri Krishna: తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘SSMB29’ కోసం ప్రిపేర్ అయ్యే పనిలో ఉన్నారు. ఈ సినిమా 2028లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. 2024 సంక్రాంతికి మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ విడుదల అయింది. అంటే నాలుగేళ్లు మహేష్ బాబు ఈ ప్రాజెక్టుకు డెడికేట్ చేయనున్నారన్న మాట. మరి అన్నాళ్లు వెయిటింగ్‌ అంటే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారు కదా! అలా కాకుండా మహేష్ బాబు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

‘దేవకి నందన వసుదేవ’లో శ్రీకృష్ణుడిగా...
గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా ‘దేవకి నందన వసుదేవ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దేవకి నందన వసుదేవ’లో శ్రీకృష్ణుడికి సంబంధించి ఒక చిన్న కేమియో ఉందని, ఆ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.

Also Readనాగార్జున కంటే ఎన్టీఆర్, నాని బెటర్ - ముందు ఆయన్ను మార్చేయాలి... స్పై అక్క సీరియస్

భారీగా పెరగనున్న హైప్...
ఒకవేళ ఈ వార్త కానీ నిజమైతే ‘దేవకి నందన వసుదేవ’పై హైప్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఆ సినిమా ప్రమోషనల్ మెటీరియర్ ఆడియన్స్‌ను పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. కానీ ఒక్క చిన్న రూమర్ ‘దేవకి నందన వసుదేవ’ గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటోంది. ఇక ఇది అఫీషియల్ అని అనౌన్స్‌మెంట్ వస్తే హైప్ భారీగా పెరుగుతుంది. అలాగే ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయి.

సూర్య ‘కంగువా’కు పోటీగా...
‘దేవకి నందన వసుదేవ’ నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజున సూర్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘కంగువా’ కూడా విడుదల కానుంది. మామూలుగా ‘కంగువా’కు ‘దేవకి నందన వసుదేవ’ పోటీ కాదని అనుకోవచ్చు. కానీ మహేష్ బాబు క్యామియో రోల్ నిజమైతే మాత్రం ‘కంగువా’ కలెక్షన్లకు తెలుగులో కాస్త డెంట్ పడే అవకాశం ఉంటుంది.

‘దేవకి నందన వసుదేవ’లో అశోక్ గల్లాకు జోడీగా మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’లో హనుమంతుడి పాత్రలో కనిపించిన దేవదత్త నాగే ఇందులో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్ మాస్ సెన్సేషన్ భీమ్స్ సిసీరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తొమ్మిది నెలల క్రితమే విడుదల అయింది. ఈ ట్రైలర్‌కు 4.1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి.

‘దేవకి నందన వసుదేవ’ అశోక్ గల్లాకు రెండో సినిమా. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘హీరో’ అనే సినిమాతో అశోక్ గల్లా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో అశోక్ గల్లా డ్యాన్సులు, ఫైట్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Readప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget