అన్వేషించండి

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేసే అవకాశం సుజిత్‌కు వచ్చింది. దీని కంటే ముందు ఆయనకు బాలీవుడ్ స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ వస్తే 'నో' అని చెప్పి ఈ సినిమా చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా సినిమా చేసే ఛాన్స్ యువ దర్శకుడు సుజిత్ (Sujeeth)కు వచ్చింది. 'సాహో' తర్వాత అతడు చేస్తున్న చిత్రమిది. 'సాహో' విడుదలైన మూడేళ్ళ తర్వాత అతడి నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ మూడేళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నాడు? మధ్యలో అతడికి ఛాన్సులు ఏవీ రాలేదా? 'సాహో' రిజల్ట్ ఎఫెక్ట్ చూపించిందా? వంటి ప్రశ్నలు చాలా వచ్చాయి. సుజిత్ క్లోజ్ ఫ్రెండ్ అడివి శేష్ చెప్పిన దాని ప్రకారం... హిందీ హీరోల నుంచి ఛాన్సులు వచ్చాయి. అయితే... తెలుగు సినిమా చేయాలని వాళ్ళకు సుజిత్ 'నో' చెప్పారు.
 
బాలీవుడ్ స్టార్స్ సుజిత్ వెంటపడ్డారు - అడివి శేష్
Pawan Kalyan's Son Akira Nandan excited about PSPK Sujeeth Movie : పవన్ కళ్యాణ్, సుజీత్ సినిమా కోసం అకిరా నందన్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడని అడివి శేష్ చెప్పారు. ఓ మీమ్ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అంతే కాదు... ఇంకా ఆయన మాట్లాడుతూ ''మూడు, నాలుగు సంవత్సరాల తర్వాత కరెక్ట్ ప్రాజెక్టు కుదిరింది. ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ సుజిత్ వెంట పడ్డారు. తనకు తెలుగు సినిమా చేయాలని ఉందని వాళ్ళకు 'నో' చెప్పాడు. సుజిత్ ఫేవరెట్, మన అందరి ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది'' అని చెప్పారు. 

పవన్ కళ్యాణ్‌కు సుజిత్ వీరాభిమాని. సుజిత్ కంటే పవర్ స్టార్‌కు గొప్ప ఫ్యాన్ లేడని అడివి శేష్ చెప్పారు. సినిమాలో ఎటువంటి ఫైట్స్, ఎలిమెంట్స్ ఉండాలో అతడికి తెలుసు అన్నారు.  

పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు' (They Call Him #OG) అంటూ పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి సినిమాపై సూపర్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. పోస్టర్ డీకోడ్ చేయడం స్టార్ట్ అయ్యింది. 

Also Read : గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? సుజిత్ పోస్టర్‌ డీకోడ్ చేస్తే

'ఆర్ఆర్ఆర్' తర్వాత...
డీవీవీ నుంచి వస్తున్న! 
ప్రపంచ ప్రేక్షకులు అందరూ తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) తర్వాత డీవీవీ (DVV Danayya) ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రమిది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో పవన్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం.

'భీమ్లా నాయక్' తర్వాత!
రవి కె. చంద్రన్ (Ravi K Chandran) ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' (Bheemla Nayak)కు ఆయన వర్క్ చేశారు. తెలుగులో ఆయనకు అది రెండో సినిమా. అంతకు ముందు 'భరత్ అనే నేను' చిత్రానికీ వర్క్ చేశారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడించనున్నారు.  

ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చారిత్రక కథతో ఆ సినిమా రూపొందుతోంది. సుజిత్ సినిమా కంటే ముందు హరీష్ శంకర్ సినిమాను పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకు తీసుకు వెళ్ళనున్నారు. వచ్చే వారం పూజా కార్యక్రమాలతో ఆ సినిమా స్టార్ట్ కానుంది. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget