Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ రోజు సినిమా ప్రకటించింది. ఆ పోస్టర్, అందులో ఏముందో సరిగా చూశారా? ఎందుకంటే... సుజీత్ చాలా విషయాలు చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా 'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ రోజు చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
Pawan Kalyan Sujeeth Movie : ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసా? అందులో చాలా హింట్స్ ఉన్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి, బ్యాక్ డ్రాప్ వరకు చాలా విషయాలను తెలివిగా రివీల్ చేశారు సుజీత్. అవి ఏంటో ఓ లుక్ వేయండి.
హీరో గ్యాంగ్‌స్టర్ కా బాప్...
నీడలో గన్ చూశారా!?
Pawan Kalyan As Gangster In Sujeeth Movie : పవన్ కళ్యాణ్‌ను దర్శకుడు సుజీత్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నారు. సినిమాలో హీరోది డాన్ రోల్. 'They Call Him #OG' అని పోస్టర్ మీద ఒక కాప్షన్ ఇచ్చారు కదా! అందులో OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. 'హీరో (పవన్ కళ్యాణ్)ను అందరూ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటారు' అనేది మీనింగ్. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ నీడను గన్ రూపంలో డిజైన్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ఆ విధంగా రివీల్ చేశారు.
జపనీస్ లైన్...
ఇది పవన్ తుఫాను!
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పోస్టర్ మీద ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఏది? అంటే... జపనీస్ లైన్స్! దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ కొంత మంది గూగుల్‌లో వెతికారు కూడా! ఆ జపనీస్ అక్షరాలకు అర్థం 'తుఫాను వస్తోంది' అని!
పోస్టర్‌లో జపాన్ జాతీయ జెండా!?
జపాన్ నేపథ్యంలో చిత్రకథ ఉంటుందని సమాచారం. పోస్టర్‌లో ఆరెంజ్ రంగులో గుండ్రంగా చూపించారు కదా! సూర్యాస్తమయంలో సూర్యుడు అన్నమాట! పవన్ కాళ్ళ కింద చూస్తే... రక్తం ఏరులై పారుతున్నట్టు, రక్తపు మడుగులో ఉన్నట్టు ఉంది. కథానాయకుడు గ్యాంగ్‌స్టర్ గొడవల నుంచి శాంతి కోసం చూస్తున్నారని చెప్పడానికి అది సంకేతమా? సినిమా వస్తే గానీ తెలియదు. జపాన్ జాతీయ జెండాలో సూర్యుడు ఎర్రటి రంగులో ఉంటాడు. నేపథ్యం అంతా తెల్లగా ఉంటుంది. కానీ, ఈ పోస్టర్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఎర్రటి నేపథ్యంలో ఆరెంజ్ కలర్ సూర్యుడిని చూపించారు.
అటు బుద్ధుడు...
ఇటు ఎర్రకోట!?
బుద్ధుడిని శాంతికి చిహ్నంగా పేర్కొంటారు. పోస్టర్‌లో ఒకవైపు బుద్ధుడు ఉంటే... మరో వైపు ఎర్రకోట లాంటి కట్టడం ఒకటి ఉంది. జపాన్, ఢిల్లీ నేపథ్యంలో కథ సాగుతుందేమో!? మొత్తం మీద ఒక్క పోస్టర్‌తో సుజిత్ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
'భీమ్లా నాయక్' తర్వాత!
ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్ అని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'కు ఆయన వర్క్ చేశారు. తెలుగులో ఆయనకు అది రెండో సినిమా. అంతకు ముందు 'భరత్ అనే నేను' చిత్రానికీ వర్క్ చేశారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడించనున్నారు.
Also Read : ఐదు 'కాంతార'లు తీయొచ్చు - ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!