అన్వేషించండి

Prabhas Movie : ఐదు 'కాంతార'లు తీయొచ్చు - ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!

Prabhas Maruthi Movie VFX Budget : ప్రభాస్, మారుతి సినిమా వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట. ఆ బడ్జెట్‌తో ఐదు 'కాంతార'లు తీయొచ్చని టాక్.

ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా మారుతి (Maruthi Director) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఇదొక హారర్ కామెడీ ఫిల్మ్. చకచకా చిత్రీకరణ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ జానర్‌లో 'ప్రేమ కథా చిత్రమ్' తీసి మారుతి విజయం సాధించారు. ఆయన సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలిసిందే. అయితే... ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తుండటం ఇదే తొలిసారి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి హారర్ జానర్ సినిమా చేస్తున్నారు. అందువల్ల, ఈ సినిమా ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ కాస్త టెన్షన్‌లో ఉన్నారు. మారుతి అంటే లో బడ్జెట్, లోకల్ నటీనటులతో చుట్టేస్తారేమోనని తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి భయాలు ఏం పెట్టుకొనవసరం లేదు. భారీ బడ్జెట్‌తో, క్రేజీ హీరోయిన్లతో మారుతి సినిమా చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. వీఎఫ్ఎక్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం.
     
'ఆదిపురుష్'లో జరిగిన
స్టేక్ రిపీట్ కాకూడదు!
ప్రభాస్ మారుతి సినిమా వీఎఫ్ఎక్స్ కోసం రూ. 80 కోట్లు కేటాయించారని తెలిసింది. ఘోస్ట్ గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదని చిత్ర బృందం డిసైడ్ అయ్యిందట. 'ఆదిపురుష్' వీఎఫ్ఎక్స్ విషయంలో వచ్చిన ట్రోల్స్ దృష్టిలో పెట్టుకుని, మళ్ళీ అటువంటి మిస్టేక్స్ చేయకూడదని నిర్ణయించారట. ప్రభాస్ కూడా వీఎఫ్ఎక్స్ విషయంలో కేర్ తీసుకోమని చెప్పారట.
 
ఐదు 'కాంతార'లు తీయొచ్చు!
ఒక్క వీఎఫ్ఎక్స్ కోసమే 80 కోట్లు అంటే ఎక్కువ బడ్జెట్ అని ఫిల్మ్ నగర్ అంటోంది. ఎందుకంటే... రీసెంట్ పాన్ ఇండియా సక్సెస్ 'కాంతార' బడ్జెట్ రూ. 16 కోట్లు మాత్రమే. ప్రభాస్ మారుతి సినిమాలో వీఎఫ్ఎక్స్ కోసం చేసే ఖర్చుతో నాలుగైదు 'కాంతార'లు తీయవచ్చని సరదాగా ఇండస్ట్రీలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 'ఆదిపురుష్' వీఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ ఖర్చు చేశామని ఆ యూనిట్ చెబుతున్నా... టీజర్ విడుదల తర్వాత ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.  

Also Read : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

ప్రభాస్, మారుతి సినిమా రెండో షెడ్యూల్ డిసెంబర్ 8 నుంచి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరో జాయిన్ అవుతారని సమాచారం. క్రిస్మస్ ముందు వరకు కీ సీన్స్ తీయాలని మారుతి ప్లాన్ చేశారట. 'బాహుబలి', 'సాహో', ఇప్పుడు చేస్తున్న 'సలార్' సినిమాలతో పోలిస్తే... ప్రభాస్ రోల్ చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలిసింది. మారుతి స్టైల్ ఆఫ్ కామెడీతో ప్రేక్షకులను ప్రభాస్ నవ్వించనున్నారని తెలిసింది.      

ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు!
ప్రభాస్, మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మరొకరు మాళవికా మోహనన్ (Malavika Mohanan) కాగా... మూడో కథానాయికను కూడా ఈ మధ్య కన్ఫర్మ్ చేశారు. రాజ్ తరుణ్ 'లవర్'లో నటించిన రిద్ధీ కుమార్ (Riddhi Kumar) గుర్తు ఉన్నారా? ఆవిడకు ప్రభాస్ మారుతి సినిమాలో నటించే అవకాశం లభించింది. 'రాధే శ్యామ్'లో ఆవిడ ఓ చిన్న రోల్ చేశారు. ఇప్పుడు ఏకంగా మూడో హీరోయిన్ ఛాన్స్ అంటే పెద్ద అవకాశమే. హిందీ సినిమా 'సలామ్ వెంకీ'లో ఆవిడ నటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget