Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!
ఈటీవీ నుంచి వెళ్లిపోయి సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, యాంకర్ అనసూయను మళ్లీ తీసుకొచ్చింది. అయితే, ‘జబర్దస్త్’ కోసం మాత్రం కాదు.
మల్లెమాల కంపెనీ ప్రొడక్ట్ అయిన ‘జబర్దస్త్’ ఎంతో మంది మట్టిలో మాణిక్యాలకు అవకాశం కల్పించింది. కనీవినీ ఎరుగని రీతిలో పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసింది. ‘ఈటీవీ’లో సక్సెస్‌ఫుల్ షోగా దూసుకెళ్తోంది. ఈ కార్యక్రమంతో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర వంటి చాలామంది కళాకారులకు గుర్తింపు లభించింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్.. ఏ బుల్లితెర స్టార్‌కు లేనంత పాపులారిటీ సంపాదించాడు. చమ్మక్ చంద్రకు కూడా అభిమానులున్నా.. ‘జబర్దస్త్’ నుంచి బయటకు వెళ్లాక. దాదాపు అంతా అతడిని మరిచిపోయారు. చంద్ర ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు.
సుధీర్, చంద్ర కొన్ని వ్యక్తిగత కారణాలతో ‘జబర్దస్త్’కు దూరమయ్యారు. ఇతర చానెళ్లకు వెళ్లిపోయారు. సుధీర్ కొద్ది రోజుల నుంచి ‘జబర్దస్త్’లో కనిపించడం లేదు. చంద్ర మాత్రం ఇంకాస్త ముందుగానే వెళ్లిపోయాడు. ‘జబర్దస్త్’ నుంచి నాగబాబు వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆయనతో పాటు చంద్ర వెళ్లాడు. జీ తెలుగులో ‘అదిరింది’ లాంటి కామెడీ షోలు చేశాడు. జనాల నుంచి అనుకున్నంత స్థాయిలో ఈ షోలకు ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం ‘కామెడీ స్టార్స్’ షోలో కొనసాగుతున్నాడు. అటు సుధీర్ సైతం ‘జబర్దస్త్’ నుంచి బయటకు వెళ్లాక ‘కామెడీ స్టార్స్’లో దర్శనం ఇచ్చాడు. ఈటీవీ నుంచి ఎందుకు వెళ్లాడనేది కచ్చితంగా తెలియకపోయినా.. రెమ్యునరేషన్ కోసమే బయటకు వెళ్లాడని జబర్దస్త్ కో స్టార్స్ చెప్పారు. వాస్తవాలు ఏంటి అనేది కచ్చితంగా తెలియదు.
మొత్తంగా సుధీర్ ‘జబర్దస్త్’కు ఇక శాశ్వతంగా దూరం అయినట్లేనంటూ వార్తలు వచ్చాయి. చమ్మక్ చంద్ర పరిస్థితి కూడా ఇంతే అనుకున్నారు చాలా మంది. అలా అనుకున్న వారి అంచనాలు ఒక్కసారిగా పటాపంచలు అయ్యాయి. అందరినీ ఆశ్చర్య పరుస్తూ.. మళ్లీ ఈటీవీలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర దర్శనం ఇచ్చారు.
ఈటీవీ 27 వసంతాలు పూర్తి చేసుకుని 28వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ‘భలే మంచిరోజు’ పేరుతో ఈ స్సెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో చంద్ర, సుధీర్ తళుక్కున మెరిసి అందరినీ అవాక్కయేలా చేశారు. అటు ‘జబర్దస్త్’ మీద సీరియస్ కామెంట్స్ చేసిన అనసూయ కూడా ఇందులో కనిపించడం విశేషం. ‘జబర్దస్త్’లో తన మీద వేస్తున్న డబుల్ మీనింగ్ పంచులు నచ్చకే ఆ షో నుంచి బయటకు వచ్చినట్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ ఈటీవీలో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా ‘భలే మంచి రోజు’ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఇందులో ప్రదీప్ మాచిరాజు యాంకర్ వ్యాఖ్యాత. ఈటీవీలో ప్రసారం అయ్యే పలు సీరియల్స్ కు సంబంధించిన నటీనటులు కూడా పాల్గొన్నారు. సీరియల్ నటులు, జబర్దస్త్ మాజీ కమెడియన్లు చేసే సందడి ఓ రేంజిలో ఉంది. ఈటీవీలో సుధీర్, చంద్రను మళ్లీ చూసి వారి అభిమానులు మస్త్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మళ్లీ వీరిద్దరు మల్లెమాల పందిరి కిందికి రావాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ షోను సుధీర్, అనసూయలు ‘జబర్దస్త్’లో ఉన్నప్పుడే షూట్ చేసి ఉంటారని మరికొందరు అనుకుంటున్నారు. ‘భలే మంచి రోజు షో’ ఈ నెల 28న ఈటీవీలో ప్రసారం కానుంది.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?