‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!
ఆన్‌లైన్ క్లాస్‌లో శ్యామ్ సింగ రాయ్ ప్రత్యక్ష మయ్యాడు. తన భార్య రోజీ సింగ రాయ్ గతం మరిచిపోయిందని, ఆమెతో తనని కలిపే బాధ్యత మీదేనని లెక్చరర్‌ను కోరాడు.
నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవలే ‘నెట్ ఫ్లిక్స్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఈ చిత్రంతో నానితోపాటు కృతిశెట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇందులో దేవదాసిగా కనిపించిన సాయి పల్లవి.. రోజీ పాత్రలో జీవించింది. ఇక నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వాసు, శ్యామ్ సింగ రాయ్ పాత్రల్లో ఒదిగిపోయారు.
‘శ్యామ్ సింగ రాయ్’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌కు శుక్రవారం.. ఓ ట్విట్టర్ యూజర్ ఓ వీడియోను ట్యాగ్ చేశాడు. ఆన్‌లైన్ క్లాస్‌లో ఓ విద్యార్థి పేరు శ్యామ్ సింగ్ రాయ్ అని ఉండటంతో లెక్చరర్.. ‘‘శ్యామ్ సింగ రాయ్ నీ పేరా? లేదా ఆ టైటిల్‌ను పెట్టుకున్నావా’’ అని అడిగారు. అది నా పేరే అని అన్నాడు. ‘‘రోజీ సింగరాయ్ నా భార్య. ఎన్నో రోజులుగా వెతుకుతున్న దొరకలేదు. బై మిస్టేక్ మీ ఆన్‌లైన్ క్లాస్‌లో దొరికింది. మీరే మా ఇద్దరిని కలపాలి. ఆమె ముసల్ది అయిపోయింది. ఇది నా పునర్జన్మ. నా పేరు వాసు. ఇదే కాలేజీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా’’ అంటూ.. చివర్లో ‘కబోడ్దార్’ అంటూ ముగించాడు. దీంతో లెక్చరర్.. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం క్లాస్ విను అని ముగించాడు. ఈ వీడియోలోని ఆడియో విన్న తర్వాత డైరెక్టర్ రాహుల్ ‘వాట్’ అంటూ ఆశ్చర్యపోయారు. మరి, ఇది నిజంగానే జరిగిందా? లేదా ఎవరైనా కావాలని రికార్డు చేశారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
What!! https://t.co/CAOoDjZEzT
— Rahul Sankrityan (@Rahul_Sankrityn) January 28, 2022
View this post on Instagram