Bagheera Trailer: ‘కేజీఎఫ్‘ను తలదన్నేలా ‘బఘీర’, ట్రైలర్ చూస్తే మతిపోవాల్సిందే!
‘కేజీఎఫ్’,’సలార్’ లాంటి సినిమాల తర్వాత హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బఘీర’. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Bagheera Movie Trailer : ‘కేజీఎఫ్’, ‘సలార్’ లాంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ సినిమాలు నిర్మించిన కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో మరో క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. యంగ్ హీరో శ్రీమురళీ, క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా 'బఘీర' అనే మాస్ యాక్షన్ మూవీ రూపొందుతోంది. పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథను అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు.
'కేజీఎఫ్', 'సలార్' బాటలో ‘బఘీర’
‘బఘీర’ ట్రైలర్ కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సెంటిమెంట్, పగ, ప్రతీకారం కలబోసుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కథ అందించడం, అదే నిర్మాణ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో మూవీ సైతం ‘కేజీఎఫ్’ను గుర్తు చేసేలా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మరో లెవెల్ లో ఉన్నాయి. “దేవుడు ఎందుకమ్మా రామాయణం, భారతం అంటూ ఎప్పుడో ఒకసారి వస్తాడు? ఎప్పుడు ఎందుకు రాడు?” అని ఓ పిల్లాడు తన తల్లిని అడిగే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. “దేవుడు అన్నిసార్లు రాడు.
సమాజంలో పాపాలు మితి మీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు, సమాజంలో కుళ్లు పెరిగినప్పుడు, మనుషులు మృగాలైనప్పుడు, ఆయన అవతారం ఎత్తుతాడు. ఆయన ఎప్పుడూ దేవుడి లాగే కాదు, రాక్షసుడిలా కూడా రావచ్చు” అంటూ తల్లి పరిస్థితులను వివరిస్తుంటే, విలన్స్ వికృత చేష్టలు తెరపై కనిపిస్తాయి. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో.. యూనిఫామ్ ను పక్కన పెట్టి క్రిమినల్స్ ను అత్యంత కిరాతకంగా చంపేస్తుంటాడు. ఎవరికీ కనిపించకుండా ముఖానికి ముసుగు వేసుకుని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ఎలిమినేట్ చేస్తుంటాడు. వెంటనే అతడిని పట్టుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు.
అతడు చంపేది క్రిమినల్స్ ను కాబట్టి ఎందుకు పట్టుకోవాలనే ఆలోచన కింది స్థాయి పోలీసులలో ఉంటుంది. ఈ సినిమాలో పోలీసుగా, విలన్స్ ఏరివేసే అజ్ఞాత వ్యక్తిగా శ్రీమురళి విశ్వరూపం చూపించాడు. ఇంతకీ రెండు పాత్రల్లో కనిపించింది ఒక్కడేనా? లేక వేర్వేరు వ్యక్తులా? అనేది సినిమాలో చూడాల్సింది. ఈ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఓ రేంజిల్ లో ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. కచ్చితంగా ఈ సినిమా హొంబలే ఫిల్మ్స్ కెరీర్ లో మరో బెస్ట్ మూవీగా మారబోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో దీపావళికి గట్టి పోటీ
‘బఘీర’ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే తేదీన తెలుగులో ‘లక్కీ భాస్కర్’ అనే స్ట్రెయిట్ మూవీ విడుదల అవుతోంది. ‘అమరన్’ అనే తమిళ డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్ కానుంది. మొత్తంగా మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. వీటిలో ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి.
Read Also: హీరోయిజం, ఫైట్లు, డ్యాన్స్ లు చాలు - కథ, స్క్రీన్ ప్లే, తొక్కా తోలు ఎవడికి కావాలి?: నాగవంశీ