Ustaad Lyrical Video: ‘ఉస్తాద్’ మూవీ నుంచి అందమైన మెలోడీ సాంగ్ విడుదల - ఆల్ ది బెస్ట్ చెప్పిన అనుష్క!
శ్రీ సింహా, కావ్య కల్యాణ్ రామ్ నటించిన తాజాగా చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ‘రోజు’ అనే లిరికల్ సాంగ్ ను అందాల తార అనుష్క విడుదల చేసింది.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు శ్రీ సింహ కోడూరి. ‘యమదొంగ’, ‘మర్యాద రామన్న’ చిత్రాల్లో బాల నటుడిగా కనిపించాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ లాంటి సినిమాలు చేసినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫణిదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్స్పిరేషనల్, క్యూట్ లవ్ స్టోరీ మూవీలో ‘బలగం’ బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘రోజు’ అనే లిరికల్ సాంగ్ ను అందాల తార అనుష్క శెట్టి విడుదల చేసింది.
‘ఉస్తాద్’ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది- అనుష్క
“‘ఉస్తాద్’ సినిమాకు సంబంధించిన రోజు అనే రిలికల్ సాంగ్ మన హృదయాలను ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషకరమైన భావాలను మోసుకెళ్ళే ప్రయాణంలా అనిపించింది. ‘ఉస్తాద్’ చిత్రా నిర్మాతలు, సిబ్బంది అందరికీ ఆల్ ది బెస్ట్. సింహా, మీరు చేసే ప్రతి పని చాలా నిజాయితీతో, ప్రేమతో చేస్తారు. మీ శ్రమ చక్కటి ఫలితాన్ని ఇస్తుందని, ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని భావిస్తున్నాను. ‘ఉస్తాద్’ సినిమాలోనే ఈ అందమైన మెలోడీ సాంగ్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని అనుష్క శెట్టి తెలిపింది.
https://t.co/kynzp0SUrX
— Anushka Shetty (@MsAnushkaShetty) May 23, 2023
The very first glimpse of Ustaad had me feel like it’s a journey we all carry in our hearts , In our life’s in our own ways … team Ustaad the producers , director, music director , cinematographer every single actor and crew member wish u all the very… pic.twitter.com/c2FFWRasTu
సినిమాపై అంచనాలను పెంచిన టీజర్
ఇక ‘ఉస్తాద్’ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై అందిరినీ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో సింహా కోడూరి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మొదట్లో ఎత్తు నుంచి కిందకి చూడాలంటే భయపడే కుర్రాడిగా శ్రీ సింహా కనిపిస్తాడు. అనంతరం తనకున్న ఫోబియాను వదిలి పెట్టడంతో పాటు పైలెట్ గా మారుతాడు. అంతకు ముందు తన పాత బైక్ ను రిపేర్ చేయించి నడుపుతాడు. తండ్రి కోప్పడినా, వేగంగా వెళ్లే వాహనాలతో పోటీపడి మరీ దూసుకెళ్తాడు. బైక్ నడిపే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎలా తట్టుకోవాలో నేర్చుకున్న మెళకులు పైలెట్ గా మారిన తర్వాత కూడా అతడికి ఎలా ఉపయోగపడతాయో టీజర్ లో చూపించారు. మొత్తంగా ఓ సాధారణ యువకుడు పైలెట్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ టీజర్ లో ఆకట్టుకునేలా చూపిచారు. కావ్య కల్యాణ్ రామ్ మరోసారి తన నేచురల్ నటనతో ఆకట్టుకుంది. వారాహి బ్యానర్‌లో బ్యానర్‌లో ‘ఉస్తాద్’ సినిమా రూపొందుతోంది. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో నెంబర్ వన్ సల్మాన్ ఖాన్, సిద్ధూ మూసే వాలా మేనేజర్ కూడా..