News
News
X

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలోకి వెళ్ళిన సత్య, కీర్తి - ఇలా భయపడిపోతున్నారేంటీ?

బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ తిరిగి పొందేందుకు బిగ్ బాస్ ఇంట్లో రకరకాల టాస్క్ లు జరుగుతున్నాయి. తాజాగా వాటి నుంచి కొద్దిగా ఫన్ క్రియేట్ చేసేందుకు బిగ్ బాస్ ట్రై చేశాడు.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ ఇంట్లో ప్రతీ సీజన్ లో ఉండే దెయ్యాల టాస్క్ ఈ సీజన్ లో కూడా పెట్టారు. అయితే అది మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈసారి మాత్రం ఇంటి సభ్యులు మొత్తాన్ని దెయ్యాల గదిలోకి పంపించి బిగ్ బాస్ అందరినీ భయపెట్టేశాడు. వాళ్ళ భయంతో ఫుల్ ఫన్ క్రియేట్ అయ్యింది. అందరి కంటే ఎక్కువగా శ్రీసత్య, శ్రీహాన్ భయపడిపోయారు. అరుపులు, కేకలతో బిగ్ బాస్ ఇంట్లోని కన్ఫెషన్ రూమ్ దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు.

తాజా ప్రోమో ప్రకారం.. ముందుగా శ్రీసత్యని మరొకసారి బిగ్ బాస్ కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. ఒక్కదాన్నే చీకటి గదిలోకి రావడం తన వల్ల కాదని సత్య చెప్పేసరికి బిగ్ బాస్ తనకి తోడుగా కీర్తిని కూడా లోపలికి రమ్మని చెప్పాడు. వాళ్లిద్దరికి నరకం చూపించాలని రేవంత్ బిగ్ బాస్ తో చెప్పాడు. ఇక అమ్మాయిలిద్దరూ కన్ఫెషన్ రూంలోకి రాగానే బిగ్ బాస్ హస్కీ వాయిస్ తో “సత్య రా” అనేసరికి “నేను రాను” అని సత్య అనడం ఫన్నీగా ఉంది. కీర్తి మాత్రం భయపడకుండా నవ్వుతూ ఉంటుంది. అరుపులు కేకలతో బిగ్ బాస్ కేకపెట్టించాడు. సత్యని చూసి కీర్తి “నువ్వే నాకు దెయ్యంలాగా కనిపిస్తున్నావ్” అని అనేసింది. దెయ్యం వేషం వేసుకున్నవ్యక్తిని చూసి కీర్తి, శ్రీసత్య వణికిపోయారు. వాళ్ళ పరిస్థితి చూసి బయట ఉన్న వాళ్ళు తెగ నవ్వుకున్నారు.

ఇక బయట ఉన్న వాళ్ళని కూడా కన్ఫెషన్ రూంలోకి రమ్మని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ చీకటి గదిలోకి వచ్చి భయంతో అరుపులు మొదలెట్టారు. శ్రీహాన్ చీకటి గదిలో భయపడుతూ ఫుల్ కామెడీ చేశాడు. కీర్తి మాత్రం భయపడకుండా మిగతా వాళ్ళని భయపెట్టేందుకు ట్రై చేసింది. బిగ్ బాస్ అయితే సత్యని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అలా అందరూ కన్ఫెషన్ రూంలో నానా హంగామా చేశారు.  

బిగ్‌బాస్ సీజన్ 6 చప్పగానే సాగుతోంది. చివరి రెండు వారాలు కూడా చిరాకు కలిగించేలాగే ఉంది. అందులోనూ ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్‌గా ఏ ఒక్కరూ పర్‌ఫెక్ట్ అనిపించకపోవడం పెద్ద మైనస్. అదే ఈ సీజన్ ఫెయిల్ అవ్వడానికి పెద్ద కారణం. కాగా విన్నర్ అవుతాడని అనుకుంటున్న రేవంత్ తన బిహేవియర్ చిరాకు పెడుతున్నాడు. మాట మీద నిలకడ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం, అలగడం, ప్రతి దానికి ఇష్యూ చేయడం చూడటానికే చిరాకుగా ఉంది. ప్రస్తుతం ఇంట్లో కామ్ అండ్ కంపోజ్డ్ రోహిత్ అనే చెప్పాలి. అతను మొదట్నించి చురుగ్గా ఆటలు ఆడి ఉంటే విన్నర్ అయ్యే వాడు. టాస్కుల్లో చురుగ్గా పాల్గొనక పోవడం అతడికి మైనస్ అయింది. ఆదిరెడ్డి నామినేషన్ సమయంలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడకుండా అతి తెలివి చూపించడం, ఎవిక్షన్ ఫ్రీపాస్ సమయంలో ఓవర్ యాక్షన్ చేయడం, తన గెలుపుపై అతి నమ్మకం పెట్టుకోవడం, తానే విన్నర్ అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ సమయంలో పదే పదే చెప్పుకోవడం కూడా ప్రేక్షకులకు చికాకు కలిగించాయి. శ్రీహాన్ విన్నర్ అని ఇంతవరకు ఎవరికీ అనిపించలేదు. అమ్మాయిల్లో ఇనయా తప్ప మిగతావాళ్లు వేస్ట్ అనే భావన ప్రేక్షకుల్లో ఉంది.

Also Read: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Published at : 09 Dec 2022 02:50 PM (IST) Tags: Revanth Bigg Boss Season 6 Telugu Bigg Boss Telugu 6 Inaya Bigg Boss Written Update Bigg Boss Daily Update

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 3rd: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు

Ennenno Janmalabandham February 3rd: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

టాప్ స్టోరీస్

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్