Bhala Thandanana: 'ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్' - 'భళా తందనాన' ట్రైలర్ చూశారా?
శ్రీవిష్ణు నటిస్తోన్న 'భళా తందనాన' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’.'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ ను, సాంగ్స్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. రెండు వేల కోట్ల హవాలా మనీ చుట్టూ తిరిగే స్టోరీ అని తెలుస్తోంది. హీరోకి ఆ డబ్బుకి సంబంధం ఏంటనేది థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ కేథరిన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించనుంది. ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. ట్రైలర్ లో వినిపించిన కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా 'ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ మొత్తాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నింపేశారు. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. ఇక శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: సురేష్ రగుతు, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్.
Also Read: రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'సమ్మతమే' టీజర్
Also Read: బ్రేకప్ తో బిజీగా ఉన్నావా? షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్లు
View this post on Instagram