అన్వేషించండి

Bigg Boss VJ Sunny: పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని 'సౌండ్ పార్టీ' చేసిన 'బిగ్ బాస్ 5' విజేత సన్నీ

Bigg Boss 5 Telugu Winner Sunny Interview: వీజేగా సన్నీ పాపులర్! తర్వాత 'బిగ్ బాస్' షోకి వెళ్లారు. విజేతగా నిలిచారు. ఇప్పుడు ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. శుక్రవారం 'సౌండ్ పార్టీ'తో రానున్నారు.

Sound Party Movie has a hilarious surprise, says VJ Sunny in Interview: సన్నీ కొందరికి వీజేగా తెలుసు. మరికొందరికి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 5 విజేతగా తెలుసు. ఇంకొందరికి హీరోగా తెలుసు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన ఈతరం యువకులలో వీజే సన్నీ ఒకరు. ఆయన నటించిన 'సౌండ్ పార్టీ' సినిమా శుక్రవారం విడుదలవుతోంది. 

'సౌండ్ పార్టీ' సందర్భంగా మీడియాతో ముచ్చటించిన సన్నీ... ''బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన ప్రాజెక్టులలో బెస్ట్ సినిమా 'సౌండ్ పార్టీ'. ఈ సినిమా కోసం 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను'' అని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లో...  

పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని...
''ప్రేక్షకులు ఎవరైనా 'సౌండ్ పార్టీ' చూసిన తర్వాత డిజప్పాయింట్ అవ్వరు. అంత నవ్విస్తుందీ సినిమా. నాకు కామెడీ జానర్ అంటే చాలా ఇష్టం. గతంలో కొన్ని కామెడీ సినిమాలు చేశా. కానీ, వర్కౌట్ అవ్వలేదు. 'ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే రా బట్టుకోవాలి' అనే ఫార్ములాతో... కామెడీ సినిమాతో హిట్ అందుకోవాలని 'సౌండ్ పార్టీ' చేశా'' అని సన్నీ చెప్పారు. గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని పూర్తి చేశానని ఆయన తెలిపారు. 

సరదాగా తండ్రీ కుమారుల మధ్య స్నేహం!
"ఈ సినిమాలో శివన్నారాయణ గారు, నేను తండ్రీ కొడుకులుగా నటించాం. మా రెండు పాత్రల మధ్య స్నేహాన్ని సరదాగా చూపించాం. డబ్బులు కోసం తండ్రీ కొడుకులు ఏం చేశారు? అనేది కాన్సెప్ట్! ఏం చేయకూడదు? అనేది సినిమాలో చూపించాం. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. కథలో బిట్ కాయిన్ కూడా కీలక పాత్ర పోషించింది. సినిమాలో పెద్ద సర్‌ప్రైజ్ ఉంది. అది ఏమిటో తెరపై చూడాలి. హీరోగా నన్ను ఎంపిక చేయడానికి కారణం దర్శకుడు సంజయ్ శేరి. నిర్మాతలకు నన్ను రిఫర్ చేసింది ఆయనే. నిర్మాతలు కొత్తవారైనా రాజీ పడకుండా సినిమా తీశారు'' అని సన్నీ చెప్పారు. 

ఆమని గారి మేనకోడలు అని తెలియదు!
'సౌండ్ పార్టీ'లో కథానాయికగా నటించిన హృతికా శ్రీనివాస్ సీనియర్ హీరోయిన్, నటి ఆమని మేనకోడలు. చిత్రీకరణ చేసేటప్పుడు తనకు ఆ విషయం తెలియదని సన్నీ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''హృతికా శ్రీనివాస్ చాలా డౌటు ఎర్త్. అంకిత భావంతో నటించింది. కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ చిత్రానికి 'వెన్నెల' కిశోర్ గారు వాయిస్ ఓవర్ ఇస్తే... నాని అన్న కూడా ప్రమోషన్స్ విషయంలో మద్దతుగా నిలిచారు. సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చింది. అమెరికాలో ప్రీమియర్ వేస్తే వందకు వంద మార్కులు వేశారు'' అని అన్నారు.

Also Read: నాగ చైతన్య చేపల వేట - 'తండేల్' కోసం ఎలా మారిపోయాడో చూశారా?

ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఏవీ అంగీకరించలేదని... తనకు ప్రయోగాత్మక పాత్రలు కూడా చేయాలని ఉందని సన్నీ తెలిపారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై జయ శంకర్ సమర్పణలో  సంజ‌య్ శేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. 

Also Readవిచిత్రకు టార్చర్ - హీరో పిలిస్తే గదికి వెళ్ళలేదని, నోరు విప్పిన 'బిగ్ బాస్' నటి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget