News
News
X

Bigg Boss 6 Telugu: శ్రీహాన్ పేరు చెప్పని కీర్తి - ఆ ఆరుగురిలో కెప్టెన్ అయ్యేదెవరు?

ఈ వారం హౌస్ లో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేశారో.. అందులో ఆరుగురు హౌస్ మేట్స్ ని ఎన్నుకోమని బిగ్ బాస్ కెప్టెన్ కీర్తిని అడిగారు.   

FOLLOW US: 
 
రెండు రోజుల నుంచి బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు ఇంటి సభ్యులు. ఆటలు, పాటలు, డాన్స్ లతో ప్రేక్షకులని అలరించారు. ఇక ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ గా మరికొన్ని టాస్క్ లతో డిజైన్ చేశారు. అలానే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఈ వారం హౌస్ లో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేశారో.. అందులో ఆరుగురు హౌస్ మేట్స్ ని ఎన్నుకోమని బిగ్ బాస్ కెప్టెన్ కీర్తిని అడిగారు.   

దీనికి ఆమె రేవంత్, సూర్య, ఫైమా, గీతూ, బాలాదిత్య, రాజశేఖర్ ల పేర్లు చెప్పింది. ఈరోజు వీరు నలుగురు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడబోతున్నారు. శ్రీహాన్ ఈ వారం బాగా ఎంటర్టైన్ చేశాడు. కానీ కీర్తి అతడి పేరు చెప్పకపోవడంతో హర్ట్ అయినట్లు ఉన్నారు. మెరీనా, రోహిత్, ఇనయాలు కూడా తమ పేర్లు చెప్పనందుకు బాధ పడ్డారు. ఇక కీర్తి ఎంపిక చేసిన ఆరుగురు సభ్యులకు రెండు టాస్క్ లను ఇచ్చి.. అందులో ఎవరు గెలుస్తారో వారికి కెప్టెన్ అయ్యే అవకాశం ఇవ్వబోతున్నారు. మరి ఈ ఆరుగురిలో కెప్టెన్ అయ్యేదెవరో ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది. 

News Reels

ఇక ఈరోజు ఉదయం విడుదల చేసిన ప్రోమోలో అయితే.. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఇంట్లో సభ్యులందరూ బిగ్ బాస్ కోరికలు తీర్చారు. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళ కోరికలు ఏంటో తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకు సభ్యులందరూ తమ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటు కన్నీళ్ళు పెట్టుకున్నారు. శ్రీహాన్ తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. సిరి నువ్వు షూట్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా రోజులో ఒక్కసారి మా అమ్మానాన్నకి కాల్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కో. ఏది జరిగినా చూసుకోడానికి నువ్వు ఉన్నావనే ధైర్యం చెప్పమని అడిగాడు.  

రేవంత్ తన భార్య, రాబోయే బిడ్డ గురించి వాళ్ళ యోగక్షేమాల గురించి తన మనసులో మాట చెప్పారు. ఇనయా తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది. తనకి హౌస్ లోకి వచ్చే ముందే పాప పుట్టిందని, త్వరలో తనకి మంచి పేరు పెట్టె సందర్భం రావాలని బాలాదిత్య కోరుకున్నాడు. బిగ్ బాస్ వింటూ.. బిగ్ బాస్ గురించి ఆలోచిస్తూ.. ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పాప బర్త్ డే ఇక్కడ జరిగితే నెక్ట్ లెవల్ హ్యాపీగా ఉంటుందని అనిపిస్తుందని ఆది రెడ్డి చెప్పుకొచ్చారు.

నిన్నటి ఎపిసోడ్లో మెరీనా, వాసంతి ఎపిసోడ్లో ఎలా ఎలివేట్ అవ్వాలో తెలియక రాత్రిపూట దెయ్యాల వేషం వేశారు. కానీ వారిద్దరూ సరిగా నటించలేకపోయారు. కాసేపు ఫర్వాలేదనిపించారు. రాత్రవ్వడంతో అందరూ నిద్రపోయారు. ఫైమా తనకిచ్చిన సీక్రెట్ టాస్కు అమలు చేసింది. ఇందులో భాగంగా ముగ్గురు ఇంటి సభ్యుల నిద్రకు భంగం కలిగించాలి. స్పూన్లు విసరడం, తలగడలు విసరడం చేసింది. వాసంతి లేచి చూసింది. మిగతా వారు కదిలినట్టు కనిపించారు కానీ భంగం కలిగినట్టు అనిపించలేదు. ఈ విషయంలో బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

తెల్లారాక ఓ కేకును పంపించారు బిగ్ బాస్. అయితే కేవలం నలుగురు మాత్రమే తినాలని, ఆ నలుగురు ఎవరో ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని, అది కూడా పావుగంటలో చేయాలని చెప్పారు. ఇంటి సభ్యులు వాదులాడుకుంటూ టైమ్ వేస్టు చేశారు. దీంతో బిగ్ బాస్ కేకు వెనక్కి తీసుకున్నారు. 

Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?

Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది

Published at : 06 Oct 2022 07:27 PM (IST) Tags: Captaincy task Revanth Bigg Boss 6 Telugu keerthi Bigg Boss 6 Geetu

సంబంధిత కథనాలు

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

Cirkus trailer: రణ్ వీర్ కామెడీ, పూజా సీరియస్, దీపిక స్పెషల్ సాంగ్,నవ్వుల పువ్వులు పూయిస్తున్న ‘సర్కస్’ ట్రైలర్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్