అన్వేషించండి

Sita Raman Hindi OTT Release: ఓటీటీలోకి ‘సీతారామం‘, హిందీలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘సీతారామం’. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కాగా, త్వరలో హిందీలోనూ సందడి చేయబోతుంది.

అద్భుత దృశ్య కావ్యం ‘సీతారామం’

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘సీతారామం’. ఈ ఏడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత ప్రేమ కావ్యంగా ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జోరు కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 85 కోట్లు సాధించింది.  తెలుగులో రూ. 40 కోట్లు వసూళు చేసింది. ఈ చిత్రంలో  లెఫ్టినెంట్ రామ్ గా దుల్క‌ర్‌ సల్మాన్, సీత పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ అద్భుత నటన కనబర్చారు. వీరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రష్మిక మందన్న పాత్ర కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యింది. ఈ ఏడాది మంచి విజయాలు సాధించిన బింబిసార, కార్తికేయ-2 సరసన ఈ సినిమా కూడా నిలిచింది.   

ఈ నెల 18 నుంచి హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్

తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది. ఈమేరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రానికి సంబంధించిన హిందీ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈనెల 18 నుంచి ఈ మూవీ తమ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ దిగ్గజ దర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘ది కార్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘సీతారామం’ ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించారు. నార్త్ టు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దర్శకుడి ప్రతిభను, హీరో, హీరోయిన్ల నటనను అభినందించారు. ఈ సినిమా బాగా లేదని ఏ ప్రేక్షకుడు కూడా చెప్పకపోవడం విశేషం.  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన పాత్రలను దర్శకుడు మలిచిన తీరుపై అద్భుతం అని కొనియాడారు. ఆర్మీ, విదేశీ రహస్యాలు, ప్రేమకథ కలగలుపుగా కొనసాగిన అద్భుత చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రంలో కొనుగోలు చేసింది. ఈ సినిమాలో సుమంత్ నెగెటివ్ ఛాయలున్న క్యారెక్ట్ చేశాడు.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్

అటు ఇప్పటికే ‘సీతారామం’ మూవీ సెప్టెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.  భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. పెద్ద సంఖ్యలో అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఈ సినిమాను చూశారు.   

Read Also: RRR-2పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి, త్వరలోనే గుడ్ న్యూస్?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Chanaka Korata Pump House: ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
Kalamkaval OTT: మమ్ముట్టి 'కలంకావల్' స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?
మమ్ముట్టి 'కలంకావల్' స్ట్రీమింగ్... ఏ ఓటీటీలో చూడవచ్చో తెలుసా?
Radhika Apte: బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
Embed widget