News
News
X

Rajamouli RRR 2 Update: RRR-2పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి, త్వరలోనే గుడ్ న్యూస్?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దేశ, విదేశాల్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా జపాన్ లోనూ విడుదలైన సంచలన విజయం అందుకుంది. త్వరలో ఈ సినిమా సీక్వెల్ తెరెక్కనుంది.

FOLLOW US: 

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం విజయం సాధించిన ‘ఆర్ఆర్ఆర్’

భారతీయ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం మార్చి 2022న విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. పీరియాడికల్ యూక్షన్ మూవీగా తెరకెక్కన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ దిగ్గజ దర్శకుల ప్రశంసలు పొందింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్,  సీతారామరాజుగా  రామ్ చరణ్ నటించి మెప్పించారు.   

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు

News Reels

ఇప్పటికీ RRR సినిమాను పలు దేశాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఈ సినిమా విడుదలైంది. అక్కడ కూడా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ జపాన్ కు వెళ్లారు. అక్కడి చానెల్స్ కు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అక్కడి అభిమానులను కలసి సందడి చేశారు. అదే సమయంలో లెజెండరీ వీడియో గేమ్స్ క్రియేటర్ కొజిమాను కలిశారు జక్కన్న. ఆయన స్టూడియోను సందర్శించారు. అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినియా ప్రస్తుతం చికాగోలో ప్రత్యేక ప్రదర్శన జరుపుతున్నారు. అక్కడి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాను చూసిన ఆడియెన్స్ రాజమౌళి దర్శక ప్రతిభతో పాటు నటులు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ యాక్టింపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.   

‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పై జక్కన్న క్లారిటీ!

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సీక్వెల్ రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి స్పందించారు.  ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు.  ప్రస్తుతం చికాగో పర్యటనలో ఉన్న రాజమౌళి ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు వెల్లడించారు. అక్కడి అభిమానులు, మీడియా అడిగిన సీక్వెల్ ప్రశ్నలపై జక్కన్న స్పందించారు. “నేను తీసే ప్రతి సినిమా కథ మా నాన్న విజయేంద్ర ప్రసాద్ రాస్తారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కథను కూడా ఆయనే రాశారు. ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఆర్ఆర్-2’ కథ పైనా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి’ అని వెల్లడించారు.     

మహేష్ బాబుతో సినిమా చేస్తున్న రాజమౌళి

మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ తో పాటు దేశ, విదేశాల్లో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందుకుంటుందని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రపంచ యాత్రికుడి మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.  

Read Also: శ్రీదేవి మరణంపై ఎట్టకేలకు నోరు విప్పిన బోనీకపూర్, ఆ బాధలో ఏం చేయాలనుకున్నారంటే!

Published at : 13 Nov 2022 12:33 PM (IST) Tags: Tollywood Latest News Director Rajamouli RRR Sequel RRR 2 Update RRR 2 Story Discussion

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు