అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tharun Bhascker As Balaji: 'సీతారామం'లో తరుణ్ భాస్కర్ - బ్రేక్ వస్తుందా?
'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ 'సీతారామం' సినిమాలో నటిస్తున్నారు.
![Tharun Bhascker As Balaji: 'సీతారామం'లో తరుణ్ భాస్కర్ - బ్రేక్ వస్తుందా? Sita Ramam Movie Introducing Pelli Choopulu Fame Tharun Bhascker As Balaji In Hanu Raghavapudi's Sita Ramam Tharun Bhascker As Balaji: 'సీతారామం'లో తరుణ్ భాస్కర్ - బ్రేక్ వస్తుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/7e1461c12ad19891f6a887a27ae841f11657721034_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'సీతారామం'లో తరుణ్ భాస్కర్ - బ్రేక్ వస్తుందా?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న సినిమా 'సీతారామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'.. అనేది ఉపశీర్షిక. 'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు.
ఇందులో రష్మిక ముస్లిం యువతిగా కనిపించనుంది. ఆమె గెటప్ అభిమానులను ఆకట్టుకుంది. అలానే ఇటీవల విడుదలైన నటుడు సుమంత్ లుక్ బాగా వైరల్ అయింది. తాజాగా ఈ సినిమాలో నటిస్తోన్న తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ వదిలారు. ఈ సినిమాలో ఆయన బాలాజీ అనే పాత్రలో కనిపించనున్నారు. మోషన్ పోస్టర్ లో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించారు తరుణ్ భాస్కర్.
'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ లో మంచి నటుడు కూడా ఉన్నారు. ఇప్పటికే లీడ్ రోల్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశారాయన. ఇప్పుడు 'సీతారామం'లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో నటుడిగా తరుణ్ భాస్కర్ కి బ్రేక్ వస్తుందేమో చూడాలి. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)