అన్వేషించండి
Advertisement
Nithiin Mahesh Babu: నితిన్ పాటకు మహేష్ బాబు స్టెప్పులు - వీడియో వైరల్
హీరో నితిన్ పాటకు మహేష్ బాబు స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ హీరో 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి 'రా రా రెడ్డి' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ లో అంజలి కనిపించింది. ఈ పాట చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' అనే సాంగ్ రీమిక్స్ ను జోడించారు. నితిన్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే 'జయం' సినిమాలో ఈ పాట చాలా ఫేమస్. ఇప్పుడు ఆ పాటను 'రా రా రెడ్డి' సాంగ్ రీమిక్స్ చేసి యాడ్ చేశారు. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పాటకు మహేష్ బాబు స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది.
మహేష్ బాబు స్టెప్పులు వేయడమంటే నిజంగానే ఆయన ఈ సాంగ్ కి డాన్స్ వేయడం కాదు. ఈ రీమిక్స్‌కు అనుగుణంగా 'సర్కారు వారి పాట'లోని 'మ.. మ.. మహేశా' స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్ చేశాడు ఓ నెటిజన్. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా.. అది కాస్త ట్రెండ్ అయింది. ఈ వీడియో చూసిన నితిన్ 'వావ్.. సూపర్.. పెర్ఫెక్ట్ సింక్' అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wowww!! SUPERB and PERFECT SYNC 🔥🔥 https://t.co/KvXrbnzo7t
— nithiin (@actor_nithiin) July 12, 2022
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
క్రికెట్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion