అన్వేషించండి
Advertisement
Sunitha: మీకో దండం రా నాయనా - ప్రెగ్నెన్సీ వార్తలపై సునీత రియాక్షన్
మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయను పట్టుకొని 'బ్లెస్డ్' అని పోస్ట్ పెట్టింది సునీత.
సింగర్ సునీతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు మధురమైన గాత్రం ఆమె సొంతం. సినిమాల్లో పాటలు పాడడంతో పాటు కొన్ని టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తుంటుంది సునీత. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె షేర్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయను పట్టుకొని 'బ్లెస్డ్' అని పోస్ట్ పెట్టింది సునీత. ఇది చూసిన చాలా మంది ఆమె తల్లి కాబోతుందని అనుకున్నారు. సునీత కూడా ఈ పోస్ట్ పై క్లారిటీ ఇవ్వకుండా కేవలం 'బ్లెస్డ్' అని క్యాప్షన్ ఇవ్వడంతో మీడియాలో కూడా ఈమె తల్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి. ఇది చూసిన సునీత వెంటనే రియాక్ట్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది.
'ఓ మై గాడ్.. పీపుల్ ఆర్ క్రేజీ.. మా మామిడి తోటలో మొదటి క్రాప్ వచ్చిందని ఫొటో తీసి పోస్ట్ చేస్తే.. ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదేదో ఊహించుకొని ఇలాంటి రూమర్స్ ను స్ప్రెడ్ చేయడం ఆపండి. మీకో దండం రా నాయనా' అంటూ రాసుకొచ్చింది. బహుశా సునీత.. పోస్ట్ లు పెట్టేప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా క్యాప్షన్ ఇస్తే ఇలాంటి రూమర్స్ రావేమో. ఇక మీదటైనా క్లారిటీగా పోస్ట్ లు పెడుతుందేమో చూడాలి!
గత ఏడాది రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగింది. ఆమెకిది రెండో వివాహం. ఇప్పటికే సునీతకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అబ్బాయి పేరు ఆకాష్, అమ్మాయి పేరు శ్రేయ. తల్లిలానే శ్రేయ కూడా చాలా బాగా పడుతుంది.
Also Read:సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion