Varisu Movie: ‘వారిసు’ పాట కోసం పైసా తీసుకోని శింబు - ఈ తారలదీ అదే దారి!
దళపతి విజయ్ నటించిన తాజాగా సినిమా ‘వరిసు‘. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ మూవీలో శింబు అదిరిపోయే పాటను పాడారు. అయితే, ఈ పాట కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని వెల్లడించారు.
![Varisu Movie: ‘వారిసు’ పాట కోసం పైసా తీసుకోని శింబు - ఈ తారలదీ అదే దారి! Silambarasan TR charges no remuneration for Varisu Movie check 3 South celebs who worked for free Varisu Movie: ‘వారిసు’ పాట కోసం పైసా తీసుకోని శింబు - ఈ తారలదీ అదే దారి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/3e0f31fa730d3231c3c8e72c4f1e0bea1672125528623544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వారిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానుల నడుమ థమన్, అనిరుధ్ ల లైవ్ మ్యూజిక్ తో ఈవెంట్ జోష్ ఫుల్ గా జరిగింది.
రెమ్యునరేషన్ వద్దన్న శింబు
ఇక ఈ సినిమాలో 'తీ తలపతి' పేరుతో అదిరిపోయే పాటను పాడారు శింబు. పాడటమే కాదు... ఆయన లిరికల్ వీడియో కోసం డ్యాన్స్ కూడా చేశారు. అయితే, ఈ సినిమా కోసం పని చేసినందుకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు. ఆడియో లాంచ్ సందర్భంగా దళపతి విజయ్ ఈ విషయాన్ని తెలిపారు. శింబు నిర్ణయం పట్ల సినీ అభిమానులు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తన సినిమాలో పాట పాడినందుకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. “శింబు, శింబు, శింబు, నేను నిజంగా టచ్ అయ్యాను, చాలా థాంక్స్” అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
Simbu, Simbu, Simbu I'm really touched Thank You
— #VARISU (@VarisuFilm) December 24, 2022
- Thalapathy Vijay @actorvijay for @SilambarasanTR_ 🔥🔥
‘వారిసు’ గురించి
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘వరిసు’లో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, షామ్, ఖుష్బు, సంగీత, యోగి బాబు, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది. అజిత్ కుమార్ ‘తునివు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతోంది.
రెమ్యునరేషన్ తీసుకోని హీరోలు వీళ్లే!
ఇక ‘వరిసు’ కోసం శింబు ఉచితంగా పని చేసినట్లుగానే, పలువురు ప్రముఖ నటుడు కూడా ఇతర హీరో సినిమాల్లో ఉచితంగా నటించిన సందర్భాలున్నాయి. కొందరు అతిథి పాత్రలు చేయగా, మరికొంత మంది గాత్రదానం చేశారు. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
తలపతి విజయ్
సౌత్ స్టార్ హీరో విజయ్, షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వస్తున్న ‘జవాన్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అట్లీ, ఖాన్ తో మంచి సంబంధాలు ఉండటంతో ఆయన ఈ సినిమాలో ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
సూర్య
కమల్ హాసన్, లోకేష్ కంగరాజ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’లో సూర్య రోలెక్స్ పాత్రలో నటించాడు. కమల్ హాసన్ పై ఉన్న గౌరవం, ఇందులో తన క్యారెక్టర్ నచ్చడంతో తను ఈ సినిమాలో ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా చేశారు. ‘విక్రమ్’ మాత్రమే కాదు, మాధవన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’లో కూడా ఓ క్యారెక్టర్ చేశారు. ఇందుకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.
సల్మాన్ ఖాన్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకే మెగాస్టార్ చిత్రం ‘గాడ్ ఫాదర్’లో భాయ్ జాన్ క్యారెక్టర్ చేశారు. ఇద్దరి నటన బాగా అలరించింది. అయితే, ఈ సినిమా కోసం సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
Read Also: జాకీతో పీకల్లోతు ప్రేమలో రకుల్, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)