అన్వేషించండి
Advertisement
DJ Tillu: 'డీజే టిల్లు' సీక్వెల్ - డైరెక్టర్ గా సిద్ధూ జొన్నలగడ్డ?
ఇటీవల థియేటర్లో విడుదలైన 'డీజే టిల్లు' అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సిద్ధూ రేంజ్ పెంచేసింది.
టాలీవుడ్ లో హీరోగా చాలానే సినిమాలు చేశారు సిద్ధూ జొన్నలగడ్డ. అయితే 'డీజే టిల్లు' మాత్రం అతడి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇప్పుడు యూత్ లో సిద్ధూ క్రేజ్ పెరిగిపోయింది. టిల్లు క్యారెక్టర్ తో అతడు చేసిన రచ్చ అలాంటిది మరి. ఈ సినిమాలో నటించడమే కాకుండా.. రైటర్ గా కూడా పని చేశారు సిద్ధూ. గతంలో కూడా తను నటించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాథ వినుమా' వంటి సినిమాల స్క్రిప్ట్స్ పై వర్క్ చేశారు సిద్ధూ.
ఆ సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల థియేటర్లో విడుదలైన 'డీజే టిల్లు' అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధూ రేంజ్ పెరిగిపోయింది. దీంతో తాను ఒప్పుకున్న వేరే సినిమాలను వదులుకొని మరీ 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నారు సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశారు. కొన్నిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ స్వయంగా వెల్లడించారు.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. 'డీజే టిల్లు' సీక్వెల్ కి దర్శకుడు కూడా సిద్ధూనే అని టాక్. నిజానికి ఫస్ట్ పార్ట్ కి సిద్ధూ కథ, మాటలు అందించారు. స్క్రీన్ ప్లేలో కూడా భాగం పంచుకున్నారు. కాబట్టి ఈసారి కూడా అవే బాధ్యతలు నిర్వర్తిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి అతడు డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ నిరూపించడానికి రెడీ అవుతున్నారట.
ఫస్ట్ పార్ట్ ను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణనే దర్శకుడిగా కొనసాగించాలని అనుకున్నప్పటికీ.. అతడికి వేరే కమిట్మెంట్స్ ఉండడంతో అతడు ఈ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాడని సమాచారం. ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్, రైటింగ్, మేకింగ్ విషయాల్లో కాస్త అనుభవం ఉండడంతో దర్శకుడిగా కూడా తనే వ్యవహరించాలని సిద్ధూ భావిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి!
Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
సినిమా
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion