Siddhant Chaturvedi: దీపికా పదుకొణెతో రొమాన్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో
Siddhant Chaturvedi: దీపికా పదుకొణెతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం పట్ల యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో ఆ సీన్లు చేస్తున్న భయంతో వణికిపోయినట్లు వెల్లడించారు.
Siddhant Chaturvedi On Intimate Scenes with Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, అనన్యా పాండే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘గ్రేహియాన్‘. షకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022లో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇందులో దీపికా పదుకొణెతో కలిసి సిద్ధాంత్ చతుర్వేది రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ సినిమా విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు ఈ యంగ్ హీరో సిద్ధాంత్.
దీపికాతో ఆ సీన్స్ అంటే చాలా భయపడ్డా- సిద్ధాంత్ చతుర్వేది
దీపికా పదుకొణెతో రొమాంటిక్ సన్నివేశాలు అనగానే భయంతో వణికిపోయానని చెప్పారు సిద్దాంత్ చతుర్వేది. డైరెక్టర్ తనకు సీన్ వివరించాగానే చాలా సేపు ఆందోళన చెందానని వెల్లడించారు. “స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు చేసే సమయంలో చాలా టెన్షన్ ఫీలయ్యాను. బాడీ అంతా వణకడం మొదలయ్యింది. చాలా కంగారుగా అనిపించింది. అక్కడే ఉన్న నిర్మాత కరణ్ జోహార్ తో పాటు మా నాన్న నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటనే మా నాన్న నా దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. ఆయన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మంచి దర్శకుడు, మంచి పేరున్న బ్యానర్, స్టార్ యాక్టర్లతో సినిమాలు చేయాలని చాలా మంది భావిస్తారు. ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి విషయాల గురించి ఆలోచించకూడదు. నువ్వు కూడా ఓపెన్ మైండ్ తో ఉండు. దీపికాతో కలిసి కేవలం నటిస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోకు. ఎలాంటి టెన్షన్ పడకుండా చక్కగా నటించమని చెప్పారు. కరణ్ జోహార్ కూడా ఇదే విషయాన్ని నాతో చెప్పారు. వాళ్ల మాటలు విన్న తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. అన్ని సీన్లు అనుకున్నట్లు వచ్చాయి” అని చెప్పుకొచ్చారు.
థియేటర్ లో ఓ మూల నిల్చొని సినిమా చూశా- సిద్ధాంత్ చతుర్వేది
ఇక ‘గ్రేహియాన్‘ సినిమాకు ఫ్యామిలీతో కలిసి వెళ్లినా, థియేటర్ లో ఓ మూలకు నిల్చొని చూసినట్లు సిద్ధాంత్ వెల్లడించారు. “ఈ సినిమా రీలీజ్ అయ్యాక, పేరెంట్స్ కలిసి థియేటర్ కు వెళ్లాను. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయం నాకు తెలుసు. అందుకే థియేటర్లో మా ఫ్యామిలీ మెంబర్స్ పక్కనే కాకుండా ఓ మూలన నిల్చొని సినిమా చూశాను” అని వెల్లడించారు.
దీపికా పదుకొణెపై తీవ్ర విమర్శలు
‘గ్రేహియాన్‘ సినిమా విడుదలయ్యాక దీపికా పదుకొణెపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. రణవీర్ సింగ్ తో పెళ్లి అయిన తర్వాత ఆమె ఈ సినిమాలో నటించారు. పూర్తి స్థాయి రొమాంటిక్ సినిమా కావడంతో ఆమె నటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లైన యువతి ఇలాంటి సినిమాలు చేస్తుందా? అంటూ మండిపడ్డారు. ఈ విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది ‘ధడక్ 2’తో పాటు ‘సింగ్ ఎగైన్’ సినిమాలో నటిస్తున్నారు.