బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునెపై నెటిజన్లు మరోసారి ట్రోల్స్‌కు దిగారు. తాజాగా కల్కీ ఈవెంట్‌కు హాజరైంది దీపికా. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌కు దిగారు. మొన్నటివరకు దీపికా బేబి బంప్ కనిపించడంలేందటూ ట్రోల్స్ చేశారు నెటిజన్లు. తాజాగా బేబి బంప్‌తో స్టైలిష్ లుక్స్‌తో కల్కి ఈవెంట్‌కు హాజరైంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బేబి బంప్ ఫేక్ అంటూ కొందరు ఇన్‌స్టాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు అసలు ఆమె మొహంలో ప్రెగ్నెన్సీ గ్లో లేదని.. శరీరం కూడా మార్పులేదని అంటున్నారు. పైగా ఈ ఈవెంట్‌కు ఆమె పెన్సిల్ హీల్స్‌పై హాజరైందని.. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా వేసుకోరని కామెంట్లు చేస్తున్నారు. కానీ మరికొందరు ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. హీల్స్‌పై ఆమెకు అలవాటని.. తనని తాను క్యారీ చేసుకుంటుందని చెప్తున్నారు. పైగా ప్రెగ్నెన్సీ మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయని దీపికాకు సపోర్ట్ చేస్తున్నారు. దీపికా కూడా ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసి.. ట్రోల్స్‌కి తగ్గట్లు Okay enough…Now I’m hungry!🍕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీపికా పదుకునే బేబి బంప్ ఫోటోలు (Images Sources : Instagram/Deepika Padukone)