Shruti Haasan: శృతి హాసన్‌కు కోవిడ్ పాజిటివ్, ‘ఇది ఫన్ కాదు’
నటి శృతి హాసన్‌కు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
![Shruti Haasan: శృతి హాసన్‌కు కోవిడ్ పాజిటివ్, ‘ఇది ఫన్ కాదు’ Shruti Haasan Tests Positive For COVID-19 Shruti Haasan: శృతి హాసన్‌కు కోవిడ్ పాజిటివ్, ‘ఇది ఫన్ కాదు’](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2019/10/09064631/pjimage.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shruti Haasan | హీరోయిన్ శ్రుతి హాసన్‌కు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం శృతి వరుస షూటింగులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్‌తో ‘సలార్’ చిత్రంలోనూ నటిస్తోంది. కరోనా సోకడం వల్ల ఆమె ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉంది.
తనకు కోవిడ్ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఇది ఫన్నీ అప్‌డేట్ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కోవిడ్ వచ్చేసింది. ప్రస్తుతం హెల్త్ బాగానే ఉంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చేస్తా’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో అభిమానులు శృతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
శృతి హాసన్ నటించిన వెబ్ సీరిస్ ‘బెస్ట్ సెల్లార్’ ఇటీవలే విడుదలైంది. ఈ థ్రిల్లర్ సీరిస్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్’లో విడుదలైన ఈ సీరిస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో శృతి భిన్నమైన పాత్రలో నటించింది. తన పాత్రలోని వేరియేషన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది.
View this post on Instagram
View this post on Instagram
Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)