Shriya Saran: తల్లైన హీరోయిన్ శ్రియ.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..
ప్రముఖ హీరోయిన్ శ్రియ శరన్ తల్లైన విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకుంది.
హీరోయిన్ శ్రియశరన్(Shriya Saran) పెద్ద సీక్రెట్ ను బయటపెట్టింది. గతేడాది తను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు షాకింగ్ విషయాన్ని చెప్పింది. రోపోసో(ROPOSO) అనే సోషల్ మీడియా యాప్ లో శ్రియ ఈ విషయాన్ని వెల్లడించింది.
Turns out @shriya1109 is an even bigger secret keeper than us 👀
— Roposo (@RoposoIndia) October 11, 2021
See how https://t.co/ONt05gOAlq she took @RoposoIndia to announce this wonderful news to the world! 😍
Here's wishing you and the lil' one all the happiness in the world! ❤ pic.twitter.com/P5fIGe1heT
Also Read: 'నన్ను ఎలెక్షన్స్ నుంచి సైడైపోమని చెప్పిందే చిరంజీవి అంకుల్..' మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..
సోషల్ మీడియా పోస్ట్: ''2020 ప్రపంచం మొత్తాన్ని కష్టపెట్టింది. ఏడాది మొత్తం అందరూ క్వారెంటైన్ లో ఉండిపోయారు. కోవిడ్ కారణంగా అందరూ ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. మాకొక ఏంజిల్ ని ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను'' అంటూ ఈ గుడ్ న్యూస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది శ్రియ.
2018లో రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ కొచీవ్(Andrei Koscheev)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియ. గతేడాది స్పెయిన్ లోని బార్సిలోనాలోనే శ్రియ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఏడాది వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టకుండా జాగ్రత్త పడింది. గతేడాది వెకేషన్ కోసం బార్సిలోనాకు వెళ్లిన శ్రియా దంపతులు లాక్ డౌన్ కారణంగానే అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యే ఇండియాకు తిరిగి వచ్చిన జంట ముంబైలో నివాసం ఉంటుంది. ఇక శ్రియ కెరీర్ విషయానికొస్తే.. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె 'ఆర్ఆర్ఆర్'(RRR) సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి