Shriya Saran-Andrei Koscheev: హాస్పిటల్ లో శ్రియ భర్త - కూతుర్ని కూడా ఎత్తుకోలేని పరిస్థితుల్లో
శ్రియా భర్త ఆండ్రూ అనారోగ్యంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ నటి శ్రియ నాలుగేళ్ల క్రితం రష్యాకి చెందిన టెన్నిస్ ప్లేయర్ ఆండ్రూ కొశ్చివ్ ను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఆండ్రూ అనారోగ్యంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా హెర్నియాతో బాధపడుతున్న ఆయన్ను అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆయన కోలుకున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో హాస్పిటల్ యాజమాన్యానికి, ఉపాసనకు ప్రత్యేకంగా శ్రియ కృతజ్ఞతలు చెప్పింది. దీంతో ఉపాసన రియాక్ట్ అవుతూ.. అంత మంచే జరిగినందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేసింది. ఈ మేరకు శ్రియా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తమ కూతురు రాధాను కూడా ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఆండ్రూ ఉండేవాడని.. ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చింది శ్రియ. ఆండ్రూతో కలిసి తీసుకున్న ఫొటోలను సైతం షేర్ చేసింది.
అందులో ఆయన లేచి తిరుగుతున్నారు.. నవ్వుతూ కనిపించారు. తన భర్తకు లిప్ లాక్ ఇచ్చేసింది శ్రియ. ఇంతకీ ఈ హెర్నియా వ్యాధి అంటే ఏంటని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. హెర్నియా అనేది మజిల్స్ కి సంబంధించినదని తెలుస్తోంది. కొన్ని కారణాల వలన కండరాలు పట్టేసి విపరీతమైన నొప్పి పుడుతుంది. ఈ వ్యాధి చాలా రకాలుగా ఉంటుందట. ఇప్పుడు శ్రియ భర్త సాధారణ స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















