FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
నార్త్ అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్లోబల్ స్టేజ్ పై గోల్స్ వరదతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఫుట్‌బాల్ హిస్టరీలోనే అత్యంత ఫాస్టె్స్ట్‌గా 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఎడిషన్‌గా ఈ ఏడాది టోర్నమెంట్ రికార్డులకెక్కింది. కేవలం 33 మ్యాచుల్లోనే ఈ 100 గోల్స్ మార్కును రీచ్ అవ్వడం గత 68 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
జూన్ 12న జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై మెక్సికో ప్లేయర్ జూలియన్ క్వినోనెస్ ఈ టోర్నీ ఫస్ట్ గోల్ కొట్టగా.. ఆదివారం జరిగిన మ్యాచ్ లో స్వీడన్‌పై నెదర్లాండ్స్ స్టార్ కోడి గ్యాక్పో కొట్టిన గోల్ ఈ టోర్నమెంట్‌లో 100వ గోల్‌గా రికార్డుల్లోకెక్కింది. కేవలం 33 మ్యాచుల్లోనే 100 గోల్స్ మార్కును అందుకోవడంతో 1982, 2014 లలో నమోదైన 36 మ్యాచుల రికార్డు బద్దలైంది.
ఇక ఇదే వరల్డ్ కప్‌లోనే మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. మాంటెర్రే స్టేడియంలో జపాన్, ట్యునీషియా జట్ల మధ్య జరిగిన గ్రూప్ F మ్యాచ్.. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ హిస్టరీలోనే '1,000వ మ్యాచ్'గా నిలిచి చారిత్రాత్మక మైలురాయిని క్రియేట్ చేసింది. ఈ చారిత్రాత్మక మైలురాయిపై ఫిఫా మేనేజ్‌మెంట్ ఒక స్పెషల్ నోట్ రిలీజ్ చేస్తూ, దేశాలను ఏకం చేయడంలో ఫుట్‌బాల్ గెలిచింది అనడానికి ఈ మ్యాచ్ ఒక నిదర్శనం అని స్పష్టం చేసింది.
ట్రెండింగ్ వార్తలు






















