Gossip Trailer: ఆ జాతకంలో పుడితే ఎఫైర్లు ఎక్కువ... 'గాసిప్'తో మారిన జీవితం - రాశి సింగ్ కొత్త సినిమా ట్రైలర్ రివ్యూ
Gossip Trailer Review: రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'గాసిప్'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. జాతకాలు, పుకార్ల నేపథ్యంలో నడిచిన ఆ ట్రైలర్ ఎలా ఉందంటే?

- రాశి సింగ్ ప్రధాన పాత్రలో 'గాసిప్' సినిమా ట్రైలర్ విడుదలైంది.
- పృథ్వీరాజ్ చెప్పినట్టు, అజంత జాతకం దరిద్రమైనదిగా ఉంది.
- ఎఫైర్లు, గాసిప్‌ల వల్ల అజంత కుటుంబం ఎలా ప్రభావితమవుతుందో చూపిస్తుంది.
- వైభవ్ కౌండిన్య రచన, దర్శకత్వంలో జూన్ 26న సినిమా విడుదల.
Raashi Singh's Gossip Movie Latest News: ఎయిర్ హోస్ట్ నుంచి హీరోయిన్‌గా మారిన అమ్మాయి రాశి సింగ్. రీసెంట్‌గా వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'లో కనిపించారు. అంతకు ముందు '3 రోజెస్' సీజన్ 2లో సందడి చేశారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'గాసిప్'. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఎలా ఉంది? అందులో ఏముంది? అనేది చూస్తే...
దరిద్రమైన జాతకంలో పుట్టిన అమ్మాయి
'ఇది మా అక్క కూతురి జాతకం. మీరు ఒక్కసారి చూసి చెప్తారా?' అంటూ పుట్టిన తేదీ, సమయాన్ని పృథ్వీరాజ్ చేతిలో పెట్టారు రవివర్మ. ఆ తర్వాత ఓ మహిళను ఆస్పత్రికి తీసుకు వెళ్లడం, డెలివరీ సమయంలో బిడ్డకు జన్మ ఇస్తూ తల్లి మరణించడం వంటి విజువల్స్ చూపించారు. 'ఇది జతకమా? దీన్ని జాతకం అంటారా? నా జీవితంలో ఇంత దరిద్రమైన జాతకాన్ని ఎప్పుడూ చూడలేదు. చూడను కూడా' అంటూ పేపర్లను టేబుల్ మీద విసిరేస్తారు నటుడు పృథ్వీరాజ్.
రవివర్మ చెప్పిన అక్క కుమార్తె ఎవరో కాదు... రాశి సింగ్. తల్లి పోయిన ఆమెను తండ్రి పెంచి పెద్ద చేస్తాడు. 'చూస్తూ ఉండు... ఆడపిల్లను పెంచితే తండ్రి కంటే ఎవరూ బాగా పెంచలేరు అన్నట్టు పెంచుతా' అని బావమరిదితో చెబుతాడు ఆ తండ్రి. ఆ తర్వాత అజంతా పాత్రలో రాశి సింగ్‌ను పరిచయం చేశారు. ఆమె వెంట ప్రేమ పెళ్లి పేరుతో పడతాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని మరొకరు తండ్రి దగ్గరకు వెళతారు.
Also Read: Vijay Trisha Breakup - విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
కెరీర్, గోల్స్ అంటూ ఆలోచిస్తున్న అజంతా (రాశి సింగ్) వెనుక అబ్బాయి పడటం, ఆ దృశ్యాలను ఇతరులు చూడటం, లేనిపోని గాసిప్స్ ప్రచారం చేయడం వంటివి చాలా జరుగుతాయి. వాటికి తోడు 'ఈ జాతకంలో పుట్టిన మహిళలకు ఎఫైర్లు ఎక్కువగా ఉంటాయి' అంటూ జోతిష్యుడు పృథ్వీరాజ్ కూడా చెబుతారు. 'గాసిప్'ల వల్ల అజంతా కుటుంబంలో జీవితాలు ఎలా మారిపోతాయో చెప్పే సినిమా 'గాసిప్' అని చిత్ర బృందం పేర్కొంది.
జూన్ 26న థియేటర్లలోకి 'గాసిప్'
Gossip Telugu Movie Release Date: రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'గాసిప్' చిత్రాన్ని వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మించారు. వైభవ్ కౌండిన్య రచయిత. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందించారు. రవి వర్మ, మహేష్ యడ్లపల్లి, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, విజయ్ అదిరాజు, గురు చరణ్, ఫాల్గుణి, శృతి తదితరులు కీలక పాత్రలు చేశారు. సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఛాయాగ్రహణం: సతీష్, కూర్పు: జై కుమార్, సహ నిర్మాత: నరసింహం తెలనాకుల.
Also Read: Ram Charan - మల్టీప్లెక్స్‌లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















