Ramayana Trailer : మా హనుమాన్ ఎక్కడ? - రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్ర మిస్సింగ్... నెటిజన్స్ ప్రశ్నల వర్షం
Ramayana Trailer Review : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే, హనుమంతుడి లుక్ మిస్ కావడంపై ప్రశ్నిస్తున్నారు.

Hanuman Ji Missing In Ramayana Trailer : ఇండియన్ సినీ చరిత్రలో మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' ట్రైలర్ వచ్చేసింది. నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. శాంత మూర్తిగా, మహా పరాక్రమ శ్రీరాముడు, సీతా మాతగా సాయి పల్లవి లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రాక్షస రాజుగా ఉగ్ర రూపంలో రావణుడి లుక్స్ వేరే లెవల్.
హనుమంతుడు ఎక్కడ?
రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు మేకర్స్. దశరథుడు, కైకేయి, రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, విశ్వామిత్రుడు, శూర్పణఖ ఇలా అన్నీ రోల్స్ ఇంట్రడ్యూస్ చేసినా... అసలైన హనమంతుడి పాత్రను చూపించకపోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
రామాయణానికే కీలక ఘట్టం, కీలక పాత్ర హనుమంతుడి. రాముని బంటు, సేవకునిగా సీతమ్మ జాడ తెలియజేసి ఇద్దరినీ కలిపి లోక కల్యాణం చేసిన మహా భక్తుడు. అలాంటి హనుమాన్‌ను ట్రైలర్‌లో ఎందుకు చూపించలేదంటూ కొందరు నెటిజన్లు నెట్టింట ప్రశ్నిస్తున్నారు. అసలు అదే మెయిన్ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ట్రైలర్ పీక్ అని... కానీ హనుమంతుడు లేకుండా రామాయణ ట్రైలర్ ఏంటి?' అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
అసలు రీజన్ అదేనా?
రామాయణ రెండు పార్టులుగా రానుండగా ఈ దీపావళికి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్‌లో శ్రీరాముడి జననం దగ్గర నుంచి శివదనుర్భంగం, సీతారాముల కల్యాణం, తండ్రి దశరథుడు ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం, అరణ్యంలో శూర్పణఖ రామున్ని చూసి మోహించడం, ఆమెకు లక్ష్మణుడు చేసిన అవమానం, రాముడిగా పగ తీర్చుకుంటానని రావణుడి శపథం వంటి అంశాలను చూపించనున్నారు.
రెండో పార్టులో సీతాపహరణం దగ్గర నుంచీ రామయ్యకు హనుమంతుని సాయం, వానర సైన్యంతో రావణుడిపై రాముని యుద్ధం చేయడం వంటి అంశాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. అందుకే హనుమంతుడి లుక్ రివీల్ చేయలేదని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. కనీసం లుక్ అయినా రిలీజ్ చేసుంటే బాగుండేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Finally Trailer of Ramayana came,
— Utkarsh (@utkarshtwtt) July 30, 2026
they should have showed at least a glimpse of Lord Hanuman ji,apart from that Ravana acting looks promising.
Jai Shree Ram🙏🏻 #Ramayana 🏹
pic.twitter.com/VSbsbs4hoz
How can they release the #Ramayana trailer without Hanuman Ji? 😡pic.twitter.com/PXtKjcJOcN
— Gaurav Tomar (@talkwithgt) July 30, 2026
ఏయే పాత్రల్లో ఎవరు?
| రోల్ | నటుడు పేరు |
| శ్రీరాముడు | రణబీర్ కపూర్ |
| సీత | సాయి పల్లవి |
| లక్ష్మణుడు | రవి దూబే |
| రావణుడు | యశ్ |
| హనుమంతుడు | సన్నీ డియోల్ |
| భరతుడు | ఆదినాథ్ కొఠారే |
| శతృఘ్నుడు | నితీశ్ శర్మ |
| దశరథుడు | అరుణ్ గోవిల్ |
| కౌసల్య | ఇందిరా కృష్ణన్ |
| కైకేయి | లారాదత్తా |
| సుమిత్ర | సోనల్ ఝా |
| మంధర | షీబా చద్దా |
| వశిష్ట మహర్షి | శిశిర్ శర్మ |
| విశ్వామిత్రుడు | అజింక్య దేవ్ |
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు























