Shiva Rajkumar Retro Look : గన్స్, కార్స్, బ్లాస్ట్స్ - రెట్రో లుక్‌లో శివన్న యాక్షన్ రైడ్!
కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఘోస్ట్'. న్యూ ఇయర్ సందర్భంగా ఒక వీడియో విడుదల చేశారు.
కరుణాడ చక్రవర్తి డాక్టర్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' (Ghost Movie). న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు.
ఒక్కసారి గ్యాంగ్‌స్టర్ అయితే...
'వన్స్ ఎ గ్యాంగ్‌స్టర్... ఆల్వేస్ ఏ గ్యాంగ్‌స్టర్' - ఇదీ 'ఘోస్ట్' సినిమాకు ఇచ్చిన కొత్త కాప్షన్. 'ఒక్కసారి గ్యాంగ్‌స్టర్ అయితే... ఎప్పుడూ గ్యాంగ్‌స్టరే' అని అర్థం అన్నమాట. 'ఘోస్ట్'లో శివ రాజ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ అని కన్ఫర్మ్ చేశారు. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో... గన్నులు, కారులు, హెలికాఫ్టర్, బ్లాస్టులు - భీభత్సమైన యాక్షన్ ఉందని హింట్ ఇచ్చారు. రెట్రో లుక్‌లో శివన్న స్టైల్ కూడా బావుంది.
ప్రస్తుతం 'ఘోస్ట్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది హై వోల్టేజ్ యాక్షన్ మూవీ. కన్నడ 'బీర్బల్' సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తన కంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
కోట్ల రూపాయలతో వేసిన జైల్ సెట్‌లో...
ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారు. ఆరు కోట్ల రూపాయల వ్యయంతో వేసిన జైల్ సెట్‌లో 'ఘోస్ట్' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. హీరోతో పాటు మలయాళ నటుడు జయరామ్ పాల్గొనగా... సుమారు 28 రోజుల పాటు సాగిన ఆ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. డిసెంబర్ రెండో వారంలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసి జైలు అవుట్ డోర్ సీన్స్ చేయనున్నట్లు చెప్పారు.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ - NTR 30 విడుదల ఎప్పుడో చెప్పేశారోచ్!
View this post on Instagram
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శక - నిర్మాతలు తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా వర్కింగ్ స్టిల్స్, వీడియో విడుదల చేశారు. గన్ పట్టుకున్న శివ రాజ్ కుమార్ స్టైల్ స్టైలిష్ & ఇంటెన్స్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటోంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో శివ రాజ్ కుమార్ అతిథిగా కనిపించారు. శతకర్ణుడి కథను వివరించే పాత్రను ఆయన పోషించారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా చేశారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఈ 'ఘోస్ట్' సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టారు. 'కెజియఫ్', 'కాంతార' విజయాలు, ఆ చిత్రాలకు ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లు మిగతా కన్నడ హీరోలకు ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు.
Also Read : పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో!? - నరేష్, పవిత్ర పెళ్లిపై రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా?
కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'ఘోస్ట్' సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. 'కెజియఫ్' ఫేమ్ శివ కుమార్ కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.