Naresh Pavitra Marriage : త్వరలో నరేష్, పవిత్ర పెళ్లి - రెచ్చిపోయిన మీమర్లు, బాబోయ్ ఆ ట్రోల్స్ చూశారా?
త్వరలో పవిత్ర, తానూ పెళ్లి చేసుకోనున్నట్లు సీనియర్ నటుడు నరేష్ వీకే ఈ రోజు వెల్లడించారు. ఈ సందర్భంగా వీడియోలో పవిత్ర పెదాలను ముద్దాడుతూ కనిపించారు. ఆయన లిప్ కిస్, పెళ్లిపై మీమర్లు రెచ్చిపోయారు.
సీనియర్ నటుడు నరేష్ వీకే (Naresh VK), నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) త్వరలో పెళ్ళి చేసుకోనున్నారు. కొన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు చేశారు. అయితే, ఇయర్ ఎండింగ్‌లో... 2022 ఆఖరి రోజున తమ బంధాన్ని నరేష్ అధికారికంగా వెల్లడించారు.
Naresh Pavitra Lokesh Wedding : నరేష్, పవిత్ర పెళ్లి కబురు చిత్రసీమలో జనాలకు షాక్ గానీ, సర్‌ప్రైజ్ గానీ ఇచ్చినట్లు లేదు. ఎవరూ స్పందించలేదు. కానీ, మీమర్స్ మాత్రం రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కూడా ఆయనపై తీవ్రంగా కామెంట్లు చేశారు. కొందరు ముసలోడిగా అభివర్ణించారు. ఇది దారుణమని చెప్పాలి. ఒక్కసారి నరేష్, పవిత్ర లిప్ కిస్ మీద వచ్చిన మీమ్స్ చూస్తే...
పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో!?
'వాల్తేరు వీరయ్య' సినిమాలో చిరంజీవి, రవితేజ డ్యాన్స్ చేసిన సాంగ్ 'పూనకాలు లోడింగ్'ను శుక్రవారం విడుదల చేశారు. నరేష్, పవిత్ర లిప్ కిస్ మీద 'బహుశా... పూనకాలు లోడింగ్ అంటే ఇదేనేమో?' అంటూ ఒకరు మీమ్ చేశారు. ఇంకొకరు 'ఖుషి' కంటే గొప్ప ప్రేమకథ ఇదంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
నరేష్ మీద పవిత్ర డామినేషన్?
నరేష్ చేసిన ట్వీట్ చూస్తే... హ్యాష్ ట్యాగ్ చూస్తే... పవిత్ర పేరు ముందు, నరేష్ పేరు తర్వాత ఉంటాయి. అంటే... అప్పుడే డామినేష్ స్టార్ట్ అయ్యిందా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. దానికి 'మన్మథుడు' సినిమాలో కింగ్ నాగార్జున వీడియో క్లిప్ వాడేశారు.
Also Read : పవన్ కళ్యాణ్ 'ఖుషి' రీ రిలీజ్ - 22 ఏళ్ళకూ అదే క్రేజ్, అదే పవర్
#PavitraNaresh https://t.co/xNWzgkVlAa pic.twitter.com/T6xeI85vpy
— Tmh_insta (@InstaTmh) December 31, 2022
సింగిల్స్ పరిస్థితి ఏంటి?
నరేష్ వయసు 62 ఏళ్ళు. పవిత్రకు 43 ఏళ్ళు. వాళ్ళిద్దరూ పెళ్ళికి రెడీ అవుతూ... మూతి ముద్దులతో రెచ్చుపోతుంటే మాలాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటంటూ కొందరు మీమ్స్ చేశారు. 'అదుర్స్' సినిమాలో బ్రహ్మానందం 'మీరు అలా సిగ్గు పడకండి. చచ్చిపోవాలని అనిపిస్తోంది' అని డైలాగ్ చెబుతారు కదా! చాలా మంది ఆ ఎక్స్‌ప్రెషన్‌తో మీమ్స్ చేశారు.
Also Read : 'కోరమీను' రివ్యూ : ఎవరి వలలో ఎవరు పడ్డారు? - ఆనంద్ రవి సినిమా ఎలా ఉందంటే?
గమనిక: సోషల్ మీడియాలో నరేష్, పవిత్రపై ట్రెండవ్వుతున్న ట్రోల్స్, జోక్స్‌ను యథావిధిగా ఇక్కడ అందించాం. అందులో వ్యక్తులు పేర్కొన్న అంశాలకు 'ఏబీపీ దేశం', 'ఏబీపీ నెట్‌వర్క్' బాధ్యత వహించదని గమనించగలరు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Ee year lo one last time nenu single ani gurthu chesinandhuku thanks umcool🥲#PavitraNaresh https://t.co/j7U1vjiJ5T
— VulcaN (@AgentVulcan) December 31, 2022
Musalaade Gani pic.twitter.com/3o3vp5OLdg
— Maggie🍜 (@Maggie_Prabhas) December 31, 2022
మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిన వయసులో blessings అడుగుతున్నారు చూసారా sir ఎక్కేసారు మరో లెవెల్.. మి చిన్నోల్ల ప్రేమను అర్థం చేసుకోవటం లేదు ఈ సమాజం
— 🇸🇱CharanRaj YSRCP🇸🇱 (@rajysrcp) December 31, 2022
ఈ దరిద్రం మాకు ఎందుకు రా 2023 లో... పెళ్లి ఓకే.. మీ ఇష్టం.. మీ లిప్ కిస్ మాకు ఎందుకు చూపిస్తున్నావు..
— Ramesh (@ramesh538) December 31, 2022
Proud to be part of #PavitraNaresh Army 😎 https://t.co/DdmOZYxDfW pic.twitter.com/BzGQqTv0SO
— Kriśh (@urstrulyAG) December 31, 2022
నరేష్ - పవిత్ర ప్రేమ...
బయటపెట్టిన రమ్య!
నరేష్, పవిత్రా లోకేష్ కొన్ని సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమాల్లో 'సమ్మోహనం' సూపర్ హిట్. ఓటీటీలో విడుదలైన ఆలీ సినిమా 'అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి' సినిమాలోనూ జంటగా కనిపించారు. ఎప్పుడో ప్రేమ చిగురించిందో... వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందంటూ నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి కొన్నాళ్ళ క్రితం ఆరోపణలు చేశారు. బెంగళూరులో పెద్ద హంగామా కూడా నడిచింది. నరేష్, పవిత్ర హోటల్‌లో ఉండగా... రమ్య రఘుపతి పోలీసులతో వెళ్ళారు. తమకు మద్దతు ఇవ్వమని పవిత్రా లోకేష్ కోరడం కూడా చర్చనీయాంశం అయ్యింది.
నరేష్, పవిత్రా లోకేష్ పెళ్ళి చేసుకున్నారని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే, నరేష్ ఈ రోజు చేసిన ప్రకటన బట్టి వాళ్ళిద్దరూ ఇంకా పెళ్ళి చేసుకోలేదని తెలుస్తోంది.