Ala Vaikunthapurramuloo: హిందీలో అలవైకుంఠపురం రీమేక్... టైటిల్ అర్థమేంటో తెలుసా?
గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా అల వైకుంఠపురములో. ఇప్పుడిది హిందీలో రీమేక్ అవుతోంది.
అల్లు అర్జున్ కెరీర్ మరింత ఎత్తుకు చేర్చిన సినిమా ‘అల వైకుంఠపురములో..’. టీవీలో ఎన్నిసార్లు వచ్చినా టీ ఆర్పీ రేట్లు అంతెత్తులో ఉండడం ఖాయం. దీన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు దానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. హిందీలో ‘షెహజాదా’ పేరుతో ఇది రీమేక్ కాబోతున్నట్టు ప్రకటించింది ఫిల్మ్ యూనిట్. ఇందులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో పరేష్ రావల్, మనీషా కొయిరాలా, రోనిత్ రాయ్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. దీని కోసం భారీ సెట్ ను సిద్ధం చేశారు. వచ్చే ఏడాది నవంబర్ 4న సినిమా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించేశారు మేకర్స్.
షెహజాదా చిత్రానికి రోహిత్ ధావన్ దర్శత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ కలిసి నిర్మిస్తున్నారు. మూవీ మేకర్స్ బుధవారం సినిమా లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత భూషణ్ మాట్లాడుతూ ‘నేను చాలా కాలంగా ఫ్యామిలీ యాక్షన్ ప్యాక్డ్, మ్యూజికల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాను. కార్తిక్, కృతి, ఇతర చిత్ర బృందం కలిసి షెహజాదాలో అద్భుతంగా నటిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. తరువాత ఢిల్లీకి మారుతుంది లొకేషన్.
ఈ చిత్ర దర్శకుడు రోహిత్ ధావన్ ఎవరో కాదు, స్వయానా వరుణ్ ధావన్ సోదరుడు. తెలుగులో టబు చేసిన పాత్రను హిందీలో మనీషా కొయిరాలా చేస్తున్నారు. హిందీలో షెహజాదా అంటే మహారాజా వారి కొడుకు అని అర్థం. ఇక ఇందులో హీరోగా నటిస్తున్న కార్తీక్ బాలీవుడ్ యంగ్ హీరో. గతంలో కృతి సనన్ తో కలిసి లూకా చుప్పి సినిమాలో నటించాడు. తిరిగి వీరద్దరూ జోడీగా రాబోతున్నారు.
Work begins 🙏🏻 #Shehzada👑 #RohitDhawan@TheAaryanKartik @kritisanon @ipritamoffical @SirPareshRawal @RonitBoseRoy @SachinSKhedkar #AnkurRathee.#BhushanKumar #KrishanKumar #AlluAravind #SRadhaKrishna #AmanGill @TSeries #AlluEntertainment, @GeethaArts @haarikahassine @brat_films pic.twitter.com/PkvdxRlGwD
— Manisha Koirala (@mkoirala) October 13, 2021
Also read: గర్భం రాకుండా వేయించుకునే లూప్ వల్ల సమస్యలు వస్తాయా?
Also read: విటమిన్ సి తగ్గిందో... ఈ రోగాలన్నీ దాడి చేసేందుకు రెడీ
Also read: వేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగితే మంచిదేగా? ఆయుర్వేదం కాదంటోంది ఎందుకు?