Nayanthara-Vignesh Wedding: నయనతార - విఘ్నేష్ పెళ్లికి హాజరైన షారూక్ ఖాన్, మరెంతో మంది టాప్ సెలెబ్రిటీలు
ప్రేమపక్షులకు నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లితో ఒక్కటయ్యారు.
కోలీవుడ్ ప్రేమికులు నయనతార, విఘ్నేష్ తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించారు. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని కోరుకున్న ఈ జంట చివరికి మహాబలిపురంలోని రిసార్ట్‌ను వేదికగా మార్చుకున్నారు. వీరి వివాహం గురువారం తెల్లవారుజామున 2.22 నిమిషాలకు జరిగింది. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారని అనుకున్నారు, కానీ
కొంత మంది టాప్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు పరిశ్రమ నుంచి మాత్రం ఎవరూ వెళ్లినట్టు సమాచారం లేదు.
వీళ్లే ఆ సెలెబ్రిటీలు
నయనతార వివాహానికి బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హాజరయ్యారు. ఆయన మేనేజర్ పూజా దద్లాని ఇన్ స్టాలో ఈ మేరకు ఫోటోను షేర్ చేసింది. అలాగే డైరెక్టర్ అట్లీ కూడా షారూక్ తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. క్రీమ్ కలర్ సూట్లో హూందాగా కనిపిస్తువన్నారు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కారు దిగి లోపలికి వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ సేతుపతి, కార్తీ, ఎస్ జె సూర్య కూడా హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా విచ్చేశారు.
ఖరీదైన రిసార్టులో పెళ్లి...
నయనతార - విఘ్నేష్ శివన్ వివాహం ‘షెరటాన్ హోటల్’ అనే రిసార్టులో జరిగింది. మహాబలిపురం నుంచి రెండు గంటలు ప్రయాణిస్తే ఈ హోటల్ కు చేరుకోవచ్చు. ఇదొక లగ్జరీ హోట్. ఇందులో భారీ గార్డెన్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫౌంటెన్స్ తో చాలా అందంగా, విశాలంగా ఉంటుంది. పెళ్లికి హాజరయ్యే అతిధుల కోసం ప్రత్యేకంగా గదులను కేటాయించారు. పెళ్లి అయ్యాక జూన్ 11న కొత్త జంట మీడియా ముందుకు రానుంది.
View this post on Instagram
Also read: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీపై రౌడీ షీటర్ దాడి
Also read: ఈ టీ షర్టు అంత ఖరీదా? కరీనా టేస్టు వరస్ట్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్