Kareena Kapoor: ఈ టీ షర్టు అంత ఖరీదా? కరీనా టేస్టు వరస్ట్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్
కరీనా కపూర్ డ్రెస్ ను చూసి కామెంట్లు మొదలెట్టారు నెటిజన్లు.
సెలెబ్రిటీలంటేనే ఫ్యాషన్. ఫ్యాషన్ డ్రెస్సులతో హల్ చల్ చేస్తూనే ఉంటారు. వారి డ్రెస్సుల ఖరీదు కూడా టాప్ రేంజ్ లో ఉంటుంది.వేలు పెట్టి కొన్నా కూడా దాని లుక్ మాత్రం రోడ్డు సైడు దొరికే డ్రెస్సుల్లా కనిపిస్తుంటాయి. ఆ డ్రెస్సులు వేసుకుని కనిపిస్తే చాలు నెటిజన్లు వదిలిపెడతారా ట్రోల్ చేయడం మొదలుపెడతారు. అలాగే ఇప్పుడు కరీనా మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. ఆమె అంతర్జాతీయ బ్రాండెడ్ సంస్థ అయిన గుచీకి చెందిన ఎల్లో టీషర్టు వేసుకుంది. ఆ టీషర్టుతోనే బయటికి వచ్చింది. అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఆమె ఫోటోలను క్లిక్ మనిపించారు. వెంటనే అవి సోషల్ మీడియాకు ఎక్కాయి. అవి నెట్టింట్లో బాగా చక్కర్లు కొట్టాయి. ఆ టీ షర్టు ఖరీదు రూ.40000. దీంతో పలువురు నెటిజన్లు ఆ టీషర్టును తిట్టడం మొదలుపెట్టారు.
‘నీ టేస్టు చాలా చెత్తగా ఉంది... ఆ టీషర్టు నలభై వేల రూపాయలేంటి’ అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు మేము నూటయాభై రూపాయలు పెడితే అలాంటి టీషర్టులు మూడు వచ్చాయి అని మెసేజ్ చేశారు. ఆ టీ షర్టు వేసుకున్న కరీనా ఫోటో వైరల్ గా మారింది. కరీనా వార్డ్ రోబ్ గుచీ సంస్థకు చెందిన టీ షర్టులే అధికంగా ఉంటాయి. వాటి ఖరీదు వేలు నుంచి లక్షల దాకా ఉంటుందని అంచనా. మొత్తం యాభై దాకా టీషర్టులు ఉన్నట్టు తెలుస్తోంది.
[insta]
View this post on Instagram
Also read: ఆ కథ చెప్పి ‘కణ్మని’ని ప్రేమలో పడేశాడు, ఇదీ నయన్-విఘ్నేష్ లవ్ స్టోరీ
Also read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయన్ - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులేవీ?