Attack on VJ Sunny: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీపై రౌడీ షీటర్ దాడి
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నటుడు వీజే సన్నీ. సీజన్ 5 విన్నర్‌గా నిలిచాక అతనికి సినిమా అవకాశాలు కూడా తలుపుతట్టాయి. కొన్ని చిన్న సినిమాలకు ఆయన సంతకం చేశారు. ఆ సినిమా షూటింగ్‌లలోప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాగా సన్నీ హీరోగా చేస్తున్న ‘ఏటీఎం’ అనే సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నగర శివార్లలోని హస్తినాపురం ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ఓ రౌడీ షీటర్ అక్కడికి వచ్చాడు. ఇక్కడ షూటింగ్ ఎందుకు చేస్తున్నారంటూ అరుస్తూ హల్చల్ చేశాడు. వీజే సన్నీ వెళ్లి ప్రశ్నించగా, అతనిపైనా దాడికి దిగాడు. దీంతో అక్కడున్నవారంతా అడ్డుకుని సన్నీని కారులో ఎక్కించి పంపించేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ రౌడీషీటర్‌ను అక్కడ్నించి తీసుకెళ్లారు. దీంతో గొడవ సద్ధుమణిగింది. అయితే రౌడీ షీటర్ అక్కడికి ఎందుకొచ్చాడు? అతనెవరు అనేది వివరాలు తెలియలేదు. సన్నీకి ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు.
స్టార్‌డమ్ ఇలా
మీడియాలో కెరీర్ మొదలుపెట్టిన సన్నీ తరువాత సీరియల్ నటుడిగా మారారు. కొన్ని సీరియళ్లలో హీరోగా నటించాడు. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 5లో అవకాశం వచ్చింది. మొదట్నించి సీజన్ మొత్తం రోలర్ కోస్టర్ ప్రయాణమే చేశారు సన్నీ. గొడవలు, స్నేహాల మధ్యే అతని ప్రయాణం సాగింది. ముఖ్యంగా మిగతా కంటెస్టెంట్ తో నవ్వుతూ, నవ్విస్తూ ఉండేందుకు ప్రయత్నించడం ఎక్కువ మందిని ఆకర్షించింది. ఇక షన్ను, సిరితో అతని గొడవలు ఆ సీజన్ కే హైలైట్ గా మారాయి. వారితో గొడవలే సన్నీని విన్నర్ ని చేశాయని చెప్పుకోవచ్చు. ఆటలో ఎక్కడ తగ్గకుండా చివరి వరకు పోరాడారు. ఇక మానస్ తో అతని స్నేహం హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా బలపడింది. వీరిద్దరూ అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతున్నారు.
View this post on Instagram
Also read: ఈ టీ షర్టు అంత ఖరీదా? కరీనా టేస్టు వరస్ట్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్