Nayanthara Weds Vignesh Shivan: జూన్ 9 నయన్‌దే, నా జీవితం ఆమెకు అంకితం, మీ అందరికీ రుణపడి ఉంటా - పెళ్లికి ముందు విఘ్నేష్ శివన్ ఎమోషనల్ పోస్ట్
Vikki Nayan Marriage: ఈ రోజు హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల పెళ్లి. ముహూర్తానికి కొన్ని గంటల ముందు విఘ్నేష్ శివన్ చేసిన పోస్ట్ చూశారా?

Nayanthara Vignesh Shivan Wedding: ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్ నేడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లి దుస్తుల్లో నయనతార ఎలా ఉంటారో చూడాలని ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో పాటు విఘ్నేష్ శివన్ కూడా! పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
''ఈ రోజు జూన్ 9. ఇది నయన్‌దే. నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన భగవంతుడికి, ఈ విశ్వానికి, నా జీవితంలో మంచి మనుషులు అందరికీ... ప్రతి ఒక్క మంచి మనసుకు, ప్రతి ఒక్కరి ఆశీర్వాదానికి, షూటింగులో ప్రతి రోజుకు థాంక్యూ. మీ ప్రార్థనలకు రుణపడి ఉంటా. ఇప్పుడు ఇదంతా లవ్ ఆఫ్ మై లైఫ్ (నా జీవితంలోని ప్రేమ రాణి) నయనతారకు అంకితం ఇస్తున్నా'' అని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు.
Also Read: పెళ్లి తర్వాత నటనకు నయనతార దూరం? కాబోయే అత్తగారు పెట్టిన కండిషన్ కారణంగా..
కొన్ని గంటల్లో నయనతార పెళ్లి దుస్తుల్లో వస్తుంటే చూడాలని చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు విఘ్నేష్ శివన్ తెలిపారు. ''నా బంగారం (నయనతారను ఉద్దేశిస్తూ) ... కొన్ని గంటల్లో నీతో కలిసి పెళ్లి ప్రమాణం చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అంతా మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, సన్నిహితుల ముందు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నాను'' అని విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు.
Also Read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయన్ - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులేవీ?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

