News
News
X

Shaakuntalam: త్రీడీలో 'శాకుంతలం' సినిమా - వాయిదా వేయక తప్పదట!

నవంబర్ 4న 'శాకుంతలం' సినిమా రానుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పిన డేట్ కి రావడం లేదని తెలుస్తోంది.

FOLLOW US: 
 
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 4న సినిమా రానుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పిన డేట్ కి రావడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేసినట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. దానికి కారణం.. ఈ సినిమాను త్రీడీ టెక్నాలజీలోకి మార్చడమే. ఇలాంటి సినిమాను త్రీడీలో చూపించడం కరెక్ట్ అని భావించిన టీమ్.. దానికోసం వర్క్ చేయడం మొదలుపెట్టారు. అందుకే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. 

తమ ప్రయత్నాన్ని భారీ ఎత్తున, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు ప్రేక్షకులకు అందించడమే తమ లక్ష్యమని.. అందుకే 'శాకుంతలం' ఆలస్యమవుతుందని వెల్లడించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

అమెరికాలో ట్రైనింగ్:

ప్రస్తుతం సమంత తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత. కొన్నాళ్లుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని వార్తలొచ్చాయి. కానీ అసలు విషయం అది కాదట. సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 'సిటాడెల్'కు రీమేక్ గా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. రుస్సో బ్రదర్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. 

ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్, డీకే ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ లో సమంత స్పై పాత్రలో కనిపించనుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు ఉన్నాయట. అందులో సమంత నటించాల్సి ఉంది. అందుకే సమంత ప్రస్తుతం అమెరికాలో నిపుణుల సమక్షంలో తన పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకుంటుంది. కఠినమైన డైట్ ను ఫాలో అవుతుందట. ఈ ప్రాజెక్ట్ పై పూర్తిగా ఫోకస్ చేయడంతో.. ఆమె సోషల్ మీడియాలో దూరంగా ఉందని తెలుస్తోంది. 

Published at : 29 Sep 2022 08:24 PM (IST) Tags: samantha Gunasekhar Shaakuntalam Shaakuntalam release date postponed Shaakuntalam postponed

సంబంధిత కథనాలు

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్  శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !