Actress Aamani: నన్ను శ్రీదేవితో పోల్చేవారు.. తోటి హీరోయిన్లతో గొడవలు, ఆ హీరో డబుల్ మీనింగ్‌లో మాట్లాడేవాడు: ఆమని
తాను నటించిన సినిమాల్లోని అన్ని క్యారెక్టర్లు నచ్చే చేశానని సీనియర్ నటి సుహాసిని వెల్లడించింది. ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించినా, ఏనాడు చిన్న గొడవ కాలేదని వివరించింది.
Senior Actress Amani About Her Successful Career: సీనియర్ నటి ఆమని తన సినీ కెరీర్ గురించి, తోటి హీరోయిన్లతో కలిసి నటించడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎంతో మంది సినిమా హీరోయిన్లతో కలిసి నటించినా, ఏనాడూ చిన్న గొడవ కాలేదని చెప్పింది. “నేను అన్ని సినిమాలు ఇష్టపడే చేశాను. ఏది కూడా ఇష్టం లేకుండా చేయలేదు. ఈ రోజుల్లో హీరోయిన్లు కథలు వింటున్నారు. కానీ, ఆ రోజుల్లో మేం కథలు వినే వాళ్లం కాదు. చాలా పెద్ద డైరెక్టర్లతో కలిసి చేశాను. నేను చేసిన క్యారెక్టర్లు అన్ని బాగా నచ్చాయి. నాకు బాగా నచ్చిన సినిమా ‘మావి చిగురు’. నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ అది. డీ గ్లామర్ అయినా చాలా బాగుంటుంది. ఎంతో మంది లెజెండ్స్ తో కలిసి నటించాను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా నేను చిన్న ఆర్టిస్టుగానే ఫీలవుతాను” అని చెప్పింది. .
నేను శ్రీదేవిలా ఉంటాను అనే వాళ్లు
చాలా మంది తనను శ్రీదేవిలా ఉంటానని చెప్పేవాళ్లని ఆమని చెప్పుకొచ్చారు. “చాలా మంది నేను శ్రీదేవిలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను అనే వాళ్లు. కానీ, నేను ఏనాడు అలా ప్రయత్నించలేదు. నేను ‘శుభలగ్నం’ సినిమా చేసినప్పుడు కూడా సుహాసిని గారు అలాగే చెప్పారు. మీకు ఎవరైనా చెప్పారా? అచ్చం శ్రీదేవిలా ఉంటావు అన్నారు. చాలా మంది చెప్పారు మేడం అన్నాను. విజయ్ కాంత్ గారు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడే వాళ్లు. ఎక్కడో ఓ తప్పు జరిగింది? అనే వాళ్లు. నాతో పోల్చితే ఆమె కాస్త వైట్ గా ఉండేది. ఆమెను రోల్ మోడల్ గా తీసుకున్నాను తప్ప, ఆమెలా ఉండాలని నేను ఏనాడు ప్రయత్నించలేదు. జయప్రద, జయసుధ అన్నా నాకు చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చూసే పెరిగాను” అని వివరించింది.
ఆ క్యారెక్టర్ బాగా లేదని ఫీలయ్యాను
తాను ఏనాడు సినిమాలో క్యారెక్టర్ బాగాలేదని బాధ పడలేదని, ఒకే ఒక్క సినిమా విషయంలో అలా జరిగిందని ఆమని చెప్పింది. “నేను సినిమాలు చేస్తున్న సమయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. రమ్యకృష్ణ, రోజా, సౌందర్య సహా అందరు హీరోయిన్లతో నటించాను. ఎవరితోనూ చిన్న గొడవ కాలేదు. ‘శుభలగ్నం’ సినిమా విషయంలో కాస్త ఫీలయ్యాను. సగం సినిమా షూటింగ్ అయ్యింది. నా క్యారెక్టర్ నెగెటివ్ ఉంటుందేమో? అనిపించింది. పాటలు కూడా నేను కాటన్ చీర కట్టుకుని ఉంటాయి. రోజా క్యారెక్టర్ ఫుల్ గ్లామరస్ గా ఉంటుంది. ఆమెతో పోల్చితే నా క్యారెక్టర్ తక్కువగా ఉంది అనిపించింది. ఆమె పక్కన నా క్యారెక్టర్ తగ్గిందేమో? అనిపించింది. కృష్ణారెడ్డి గారు పిలిచి, ఎందుకు డల్ గా ఉన్నావు? ఈ సినిమా పాటల్లో నీ పాటే హైలెట్ అవుతుందని చెప్పారు. ఏదో ఆయన నన్ను ఓదార్చడానికి అలా చెప్తున్నారు అనుకున్నాను. ఆయన చెప్పినట్లు నేను నటించిన పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చాలా మంది ఇప్పుడు కూడా నాతో ఆ పాటకు రీల్స్ చేద్దాం అంటారు. ‘శుభలగ్నం’ సినిమాలో సుహాసిని గారు గెస్ట్ రోల్ చేశారు. ఆమెకు కృష్ణారెడ్డి గారు కథ చెప్పారు. అప్పుడు తను ఈ అమ్మాయి క్యారెక్టర్ హైలెట్ అవుతుందని చెప్పింది. అప్పుడు నాకు ధైర్యం అనిపించింది. ఫర్వాలేదు, నా క్యారెక్టర్ బాగుంది అనిపించింది” అని వివరించింది.