Sarkaru Vaari Paata : సూపర్‌స్టార్ బర్త్‌డే బ్లాస్టర్.. ఆ కటౌట్ చూశాక నిజంగా 'దిష్టి తీయాల్సిందే'
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేశారు. ఆయన నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా నుండి స్పెషల్ వీడియోను విడుదల చేశారు. 'సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్' పేరుతో ఈ వీడియో విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు చాలా అందంగా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సింపుల్ గా కట్ చేసిన ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ చెప్పే డైలాగ్స్, కీర్తి సురేష్ తో లవ్ ట్రాక్ హైలైట్ గా నిలిచాయి.
''ఇఫ్ యూ మిస్ ది ఇంట్రస్ట్ యు విల్ గెట్ ది డేట్' అంటూ యాక్షన్ సీన్ కు ముందు రౌడీలతో మహేష్ చెప్పే డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ''సార్ పడుకునేముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి'' అంటూ కీర్తి సురేష్.. మహేష్ బాబు అందం గురించి చెప్పడం, దానికి ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. చివర్లో కీర్తి సురేష్ మల్లెపూలు పెట్టుకొని నడుస్తుంటే.. వెనుక నుండి చూసిన మహేష్ 'ఏమయ్యా కిషోర్ ఓ ఐదారు మూరలు ఉండవా అవి' అంటూ చేతితో కొలిచినట్లు చెప్పడం ఫన్నీగా అనిపిస్తుంది.
ఈ వీడియోలో మహేష్ బాబుతో పాటు కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ లకు కూడా చోటిచ్చారు. అలా సినిమాలో యాక్షన్ తో పాటు లవ్, కామెడీ కూడా ఉంటాయనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ వీడియోలో మహేష్ బాబు లుక్, స్టైలిష్ అవతారం చూసిన ఫ్యాన్ మురిసిపోతున్నారు . గడిచిన రెండు, మూడు సినిమాల్లో మహేష్ ఎక్కడా కొత్తగా కనిపించలేదు. ఇన్నాళ్లకు 'సర్కారు వారి పాట' సినిమాలో పూర్తి మేకోవర్ చూపించారు.
మహేష్ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేశారు. ఈ బర్త్ డే బ్లాస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. దీంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పండక్కి మహేష్ బాబు కన్నులపండగ తీసుకురాబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Also Read : Happy Birthday Mahesh Babu : అందంలో ప్రిన్స్.. మనసులో మారాజు.. సింపుల్ గా సూపర్ స్టార్..