Sarkaaru Noukari Movie OTT: ఆ ఓటీటీకి సునీత కుమారుడు ఆకాష్ తొలి సినిమా 'సర్కారు నౌకరి'
Singer Sunitha son Akash debut movie: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'సర్కారు నౌకరి'.
Sarkaaru Noukari OTT platform: ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. తల్లి సింగర్ అయితే... 'సర్కారు నౌకరి' సినిమాతో ఆయన హీరోగా వస్తున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు నిర్మాతగా... ఆయనకు చెందిన ఆర్.కె. టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. జనవరి 1, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయ్యారు.
ఈటీవీ విన్ (ETV Win)లో 'సర్కారు నౌకరి'
Sarkaaru Noukari digital streaming rights acquired by ETV Win: ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ నెట్వర్క్‌కి చెందిన 'ఈటీవీ విన్' ఓటీటీ వేదిక 'సర్కారు నౌకరి' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు ఓటీటీలో సినిమా వస్తుందో చూడాలి.
రాఘవేంద్ర రావుతో పాటు సునీతకు ఈటీవీ సంస్థతో అనుబంధం ఉంది. 'పాడుతా తీయగా' షోలో సునీత న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆ టీవీలో వచ్చే మరికొన్ని కార్యక్రమాల్లో సైతం ఆమె కనిపిస్తూ ఉంటారు. దర్శకేంద్రుడు హోస్ట్ చేసిన టాక్ షో ఈటీవీలో ప్రసారం అయ్యింది. ఆ అనుబంధంతో 'సర్కారు నౌకరి' విడుదలకు ముందు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నట్లు ఉన్నారు.
Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?
'సర్కారు నౌకరి' సినిమాలో ఎవరెవరు ఉన్నారు?'సర్కారు నౌకరి' సినిమాలో ఆకాష్ సరసన భావనా వళపండల్ కథానాయికగా నటించారు. ఇంకా ఇతర ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్, సాహితి దాసరి తదితరులు నటించారు.
పీసీ శ్రీరామ్ దగ్గర పలు చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన... ఆది సాయి కుమార్ 'సీఎస్ఐ సనాతన్'తో పాటు 'కథ వెనుక కథ', 'అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి' తదితర చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన గంగామోని శేఖర్ 'సర్కారు నౌకరి' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు ఆహా ఓటీటీలో విడుదలైన యాంథాలజీ ఫిల్మ్ 'పంచతంత్ర కథలు'కు ఆయన దర్శకత్వం వహించారు. 'సర్కారు నౌకరి' సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Also Read: మానసా చౌదరి రొమాన్స్ మామూలుగా లేదుగా, ఒక్క పాటలో 14 లిప్ కిస్‌లు!
'సర్కారు నౌకరి' సినిమాలో పాటలకు శాండిల్య బాణీలు అందించగా... సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం అందించారు. దర్శకత్వం వహించడంతో పాటు ఛాయాగ్రహణ బాధ్యతలు సైతం గంగనమోని శేఖర్ నిర్వర్తించారు.
Also Read: డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
Get ready to experience the blend of love & one man’s aspirations ❤️🎬#SarkaaruNoukari is all set for Worldwide release on 1st January 2024#SarkaaruNoukari @ShekarPhotos @AkashGoparaju98 @BVazhapandal #SandilyaPisapati @OfficialSunitha @MangoMusicLabel pic.twitter.com/G8gEbTLMFy
— Raghavendra Rao K (@Ragavendraraoba) December 15, 2023