By: ABP Desam | Updated at : 26 Jul 2022 08:07 PM (IST)
మహేష్ బాబు సినిమాలో సంయుక్త - క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కానీ ప్రస్తుతం షూటింగ్స్ ను తాత్కాలికంగా నిలిపివేయడంతో మహేష్ సినిమా మొదలవ్వడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో సంయుక్త మీనన్ ను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. 'భీమ్లానాయక్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సంయుక్త. త్రివిక్రమ్ స్వయంగా ఆమెని టాలీవుడ్ కి తీసుకొచ్చారని అంటారు. అలానే ఆమెకి 'సార్' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడానికి కూడా త్రివిక్రమే కారణమని టాక్. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో సంయుక్తకి ఆఫర్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది సంయుక్త మీనన్. 'త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో నేను ఉన్నాననే వార్తల్లో నిజం లేదు. మహేష్ గారి సినిమాలో నేను నటించడం లేదు. ఇలాంటి రూమంర్స్ క్రియేట్ చేయాలంటే చాలా క్రియేటివిటీ కావాలి. ఇదే కాదు.. 'సార్' సినిమా షూటింగ్ లో ధనుష్ తో నాకు విబేధాలు వచ్చినట్లు, నేను సెట్స్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు కథనాలు ప్రచురించారు. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారో..? ఒకప్పుడు రూమర్స్ అంటే భయపడేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: ఈ వారం విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!
Also Read: నాని సినిమాలో ఇంటెన్స్ లవ్ స్టోరీ - ప్లస్ అవుతుందా?
Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్లో విజయ్ దేవరకొండ
Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్
Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!
Independence Day 2022 : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ
Tejaswi Madivada Shocking Comments : అడల్ట్ కంటెంట్ చేయడంలో తప్పేముంది? - తేజస్వి షాకింగ్ కామెంట్స్
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్
KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ
Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!