Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!
అక్కినేని కుటుంబ సభ్యులు, సమంత ప్రొఫెషనలిజమ్ చూపిస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి పర్సనల్ లైఫ్ రానివ్వడం లేదు. ఈ విషయంలో వాళ్లందరినీ అభినందించాలి.
![Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి! Samantha Steps into akkineni compound annapurna seven acres studios to dub for Shakuntalam movie Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/27/3f44976d1bbee3d839faebf4b602a20d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అక్కినేని కాంపౌండ్‌లో సమంత అడుగుపెట్టారు. అదీ ఓ సినిమా పని కోసం! పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి మరీ ప్రొఫెషనలిజమ్ చూపించారు. అసలు వివరాల్లోకి వెళితే... అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఏకర్స్ అంటే అక్కినేని ఫ్యామిలీ ప్రోపర్టీ. సమంత నటించిన తాజా సినిమా 'శాకుంతలం' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అందులో జరుగుతున్నాయి. ఆ పనుల నిమిత్తం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోస్‌కి సమంత వెళ్లారు. అందులోనే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం.
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి సమంతకు అవకాశాలు రావడం చాలా కష్టమని పలువురు వ్యాఖ్యానించారు. అయితే, సమంతకు అవకాశాలు వస్తున్నాయి. ఆమెతో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అక్కినేని ఫ్యామిలీ కోసం సమంతను పక్కన పెడతారని కొంత మంది కామెంట్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. అయితే, ఇప్పుడు 'శాకుంతలం' చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోస్‌కు సమంత వెళ్లడం చూస్తే... ఆమెను అక్కినేని ఫ్యామిలీయే పక్కన పెట్టలేదని అర్థం అవుతోంది.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'శాకుంతలం' సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో సమంతకు జంటగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. అది కాకుండా... శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ తెలుగు - తమిళ సినిమా, ఎస్.ఆర్. ప్రభు - ఎస్.ఆర్ శేఖర్ నిర్మాణంలో మరో ద్విభాషా సినిమా అంగీకరించారు. 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అని ఓ ఇంటర్నేషనల్ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ చేయడానికి ఎస్ చెప్పారు.
View this post on Instagram
Also Read: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా..
Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్
Also Read: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..
Also Read: ఒక్క రోజు ఆలస్యంగా 'మరక్కార్'... గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్!
Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)